అప్పుడు వడదెబ్బ – ఇప్పుడు కరోనా – పవన్ కల్యాణ్ కు కలిసిరాని ఏప్రిల్ ఎన్నికల ప్రచారం

pawan kalyan april ections

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనారోగ్యానికి – ఎలక్షన్స్ కు ఏదో లింక్ ఉన్నట్లు ఉంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. ప్రచారం తర్వాత పవన్ కల్యాణ్ అనారోగ్యం బారిన పడ్డారు. ఇప్పుడు తిరుపతి ఎన్నికల ప్రచారం తర్వాత.. పోలింగ్ ముందు రోజు కరోనా బారిన పడ్డారు. ఇదే ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

pawan kalyan election campaing

2019 ఏప్రిల్ 4వ తేదీన తీవ్రమైన ఎండల్లో ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ వడదెబ్బ బారిన పడ్డారు. రెండు రోజులు ఆస్పత్రిలో ఉండి.. చేతికి సెలైన్ ట్యూబ్ తోనే ప్రచారంలో తిరిగారు.

pawan kalyan election campaign

సరిగ్గా రెండేళ్ల తర్వాత తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో ర్యాలీ, సభ నిర్వహించి వచ్చారు. ఆ వెంటనే కరోనా బారిన పడి.. ఊపిరితిత్తుల సమస్యతో ఫాంహౌస్ లో వైద్యం తీసుకుంటున్నారు.

అప్పట్లో 2019, ఏప్రిల్ 4వ తేదీ.. ఇప్పుడు 2021, ఏప్రిల్ 16వ తేదీ.. ఏప్రిల్ నెల.. ఎన్నికల ప్రచారం పవన్ కల్యాణ్ కు అచ్చొచ్చినట్లు లేదు అంటున్నారు ఫ్యాన్స్.

మంచంపై.. ముక్కులో ఆక్సిజన్ ట్యూబ్ తో ఉన్న పవన్ కల్యాణ్ ఫొటో చూసి ఫ్యాన్స్ అందరూ బాగా ఫీలవుతున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ జనసేనానికి, హీరోకి అభినందనలు చెబుతున్నారు.

pavana kalyan covid positive

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు