అబార్షన్లు చట్టబద్దం చేసిన మొదటి దేశం.. సంబరాలు చేసుకున్న మహిళలు

అర్జెంటీనా దేశంలో మహిళలకు సేఫ్ అండ్ లీగల్ అబార్షన్లతో స్వాతంత్రం లభించిందంటూ నినాదాలు చేశారు. కొత్త చట్టం ప్రకారం 14.....

Argentina’s first major country in Latin America to legalise abortion
Argentina’s first major country in Latin America to legalise abortion

పుట్టబోయే బిడ్డ ఆడ, మగా అని తెలుసుకోవటం నేరం.. అత్యవసరం అయితే అబార్షన్ చేయాలి.. ఇందుకు కూడా భర్త అనుమతి తప్పనిసరి.. ఇలా ఎన్నో రూల్స్ ఉన్నాయి చాలా దేశాల్లో.. అందులో భారతదేశం ఒకటి. ఇప్పుడు అబార్షన్లను చట్టబద్దం చేస్తూ.. అర్టెంజటీనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. లాటిన్ అమెరికా దేశాల్లో అబార్షన్లను చట్టబద్దం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ఏకైక దేశం కావటం విశేషం.

శిశువులను జీవించే హక్కు నుంచి దూరం చేయటం అని సంప్రదాయవాదులు గగ్గోలు పెట్టినా.. ఆందోళనలు చేసినా.. కన్నీళ్లు పెట్టుకున్నా పార్లమెంట్ లో అత్యధిక ఓట్లతో ఆమోదం పొందటం విశేషం.

38 మంది అబార్షన్లకు ఓకే చెబితే.. 29 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో పార్లమెంట్ ఈజీగా గెలిచింది ఈ చట్టం. దీంతో పార్లమెంట్ ఎదుట సంబరాలు చేసుకున్నారు మహిళలు.

అర్జెంటీనా దేశంలో మహిళలకు సేఫ్ అండ్ లీగల్ అబార్షన్లతో స్వాతంత్రం లభించిందంటూ నినాదాలు చేశారు. కొత్త చట్టం ప్రకారం 14 వారాల గర్భం వరకు మహిళలకు అబార్షన్లను అనుమతిస్తుంది. అంటే 4వ నెలలో అబార్షన్ చేయించుకోవచ్చు.

2018లోనే ఈ చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా.. పార్లమెంట్ ఓడిపోయింది. ఇప్పుడు ఆమోదం లభించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు