ఊహకందనిరీతిలొ దాడి చేసిన భారత ఆర్మీ. 22 మంది టెర్రరిస్టులు, భారీ సంఖ్యలో పాక్ సైనికులు మృతి

ఊహకందనిరీతిలొ దాడి చేసిన భారత ఆర్మీ. 22 మంది టెర్రరిస్టులు, భారీ సంఖ్యలో పాక్ సైనికులు మృతి

సరిహద్దులో బీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో టెర్రరిస్టులతోపాటు మన సైనికులు కూడా మృతి చెందుతున్నారు. తాజాగా నలుగురు సైనికులను పోగొట్టుకున్నాం.. సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకునే దిశగా భారత ఆర్మీ సరిహద్దుల్లో బీకర కాల్పులకు దిగింది.షాకోట్ వద్ద నున్న టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ పై విరుచుకుపడింది.

మొత్తం లాంచ్ ఫ్యాన్ ను లేపేసింది.. అందులో 15 నుంచి 22 మంది టెర్రరిస్టులు ఉన్నట్లుగా సమాచారం. లాంచ్ ప్యాడ్ లో ఉన్నవారంతా మృతిచెందారు. హెవీ వెపన్స్, లాంగ్ రేంజి ఆర్టిలరీలు ఉపయోగించి భారత భూభాగం నుంచే దాడిచేసింది ఆర్మీ.

ఇక మరోవైపు నీలం వ్యాలీ వద్దనున్న మసీదులో పాక్ సైనికులు దాక్కున్నారన్న సమాచారంతో దాడి చేసింది ఆర్మీ.. ఈ దాడిలో 10 మందికిపైగా పాక్ సైనికులు మృతి చెంది ఉంటారని సమాచారం. మొన్న జరిగిన ఘటనతో రగిలిపోతున్న భారత ఆర్మీ సరిహద్దుల్లో టెర్రరిస్టుల ఆనవాళ్లు లేకుండా చేస్తుంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి టెర్రరిస్టుల స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగుతుంది.

అంతే కాకుండా భారత్ లోకి టెర్రరిస్టులు ప్రవేశించే ఆస్కారం ఉందని నిఘావర్గాల హెచ్చరికలతో సరిహద్దుల్లో ఆర్మీ అప్రమత్తమైంది. బీఎస్ఎఫ్ బలగాలు అనునిత్యం సరిహద్దుల్లో జల్లెడపడుతున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు