అసోం మాజీ సీఎం తరుణ్ గొగొయ్ కన్నుమూత

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆహార శాఖ మంత్రిగా

మోస్ట్ సీనియర్ రాజకీయ నేత, అసోం రాష్ట్ర మాజీ సీఎం తరుణ్ గొగొయ్ కన్నుమూశారు. 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. 15 ఏళ్లు ఆయన అసోం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. నెల రోజులుగా ఆస్పత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారిన పడ్డారు. వైరస్ ఇన్ ఫెక్షన్ వల్ల ఇతర అవయవాలు దెబ్బతిని కన్నుమూశారు.

2001 నుంచి 2016 వరకు 15 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ తరపున అసోం సీఎంగా పని చేశారు.
లోక్ సభ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సార్లు గెలిచారు.
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆహార శాఖ మంత్రిగా పని చేశారు.
గౌహతి యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్న గొగొయ్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.

అసోం రాష్ట్రం ఎంతో విలువైన నేతను కోల్పోయిందని, దేశ రాజకీయాలకు కూడా తీరని లోటు అని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు