వీడియో లీక్ : 17న తర్వాత ఫ్రీ అయిపోతాం.. పార్టీ లేదు.. బొక్కా లేదు : అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

17న తర్వాత ఫ్రీ అయిపోతాం.. పార్టీ లేదు.. బొక్కా లేదు.. అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. చంద్రబాబు, లోకేష్ కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు.. తిరుపతి ఉప ఎన్నికలో గెలుస్తామనే అధినేత ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఏప్రిల్ 17వ తేదీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న సమయంలో.. ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న అచ్చెన్నాయుడు.. ఓ గెస్ట్ హౌస్ లో భోజనం చేస్తూ.. తన అనుచరులతో ఇలా మాట్లాడారు. 17 అయితే అందరూ ఫ్రీ అయిపోతాం.. ఇక పార్టీ లేదు.. బొక్కా లేదు అంటూ అక్కడ ఉన్న అనుచరులతో వ్యాఖ్యలు చేశారు. దీనికి రెస్పాన్స్ గా ఓ అనుచరుడు.. మీరు ఏమైనా అనుకోండి.. ఇక పార్టీ లేదు.. గీర్టీ లేదు అంటాడు.

అచ్చెన్నాయుడుతో ఓ అనుచరుడు మాట్లాడుతూ.. నా ఫోన్ ఎత్తటం మానేశారు.. ఎవరూ మాట్లాడటం లేదు.. 30 ఏళ్లు సర్వీస్ చేస్తే ఇదా ఇచ్చే గౌరవం.. సూసైడ్ చేసుకుంటాం అంటే.. చేసుకోండి అంటున్నారు.. ఇక పార్టీ లేదు సార్ అంటూ ఆ అనుచరుడు అనటం.. దానికి అచ్చెన్నాయుడు సమర్థించటం జరిగింది.

17 తర్వాత ఫ్రీ అయిపోతాం.. ఆ తర్వాత పార్టీ లేదు.. బొక్కా లేదు అంటూ అచ్చెన్నాయుడు వారితో అనటం వీడియోలో స్పష్టం కనిపించింది.. వినిపించింది. ఉప ఎన్నిక పోలింగ్ కు మూడు రోజుల ముందు ఈ వీడియో బయటకు రావటం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది.

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో ఇంత కాలం పడిన కష్టం అంతా బూడితలోపోసిన పన్నీరు అయ్యిందని.. అలా మాట్లాడాల్సింది కాదని అంటున్నారు.బయటకు లీక్ అయిన అచ్చెన్నాయుడి వీడియోలు చూసేయండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు