జులాయి సినిమా తరహాలో హైదరాబాద్ లో ఏటీఎం దోపిడీ

ఏటీఎం మెషీన్ చాలా స్ట్రాంగ్.. దాన్ని ఎవరూ ఏమీ చేయలేరు.. ఎంతో సేఫ్ అనే మాటలు తప్పు అని నిరూపించారు

అప్పుడెప్పుడే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో జులాయి అనే సినిమా వచ్చింది. అందులో స్టార్టింగ్ లోనే ఓ బ్యాంక్ దోపిడీ జరుగుతుంది. సేమ్ టూ సేమ్ అదే తరహాలో బ్యాంక్ కాకపోయినా.. ఏటీఎం మెషీన్ ను దోపిడీ చేశారు దుండగులు.

ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ సిటీలోని వనస్థలిపురం ఏరియాలోని SBI ఏటీఎం సెంటర్ ఉంది. అర్థరాత్రి ముసుగులు ధరించిన దుండగులు.. గ్యాస్ కట్టర్ తో సెంటర్ లోకి వెళ్లారు. షెట్టర్ క్లోజ్ చేశారు. మెషీన్ ను కట్ చేశారు. అందులోని డబ్బు మొత్తం దోచుకున్నారు. లక్షల రూపాయలు ఉన్నాయని బ్యాంక్ అధికారులు అంటున్నారు. సెంటర్ లోని సీసీ కెమెరాలకు నల్ల రంగుపూశారు.

ఎవరికీ అనుమానం రాకుండా చక్కగా చెక్కేశారు. సినిమా తరహాలో జరిగిన ఈ దోపిడీ పోలీసులనే షాక్ కు గురి చేసింది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం, రెక్కీ నిర్వహించి దోపిడీ ప్లాన్ వేసినట్లు చెప్పారు. ఏటీఎం మెషీన్ చాలా స్ట్రాంగ్.. దాన్ని ఎవరూ ఏమీ చేయలేరు.. ఎంతో సేఫ్ అనే మాటలు తప్పు అని నిరూపించారు ఈ కంత్రీ దొంగనాయాళ్లు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు