బ్రేకింగ్ టీఆరెస్ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

బ్రేకింగ్ టీఆరెస్ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఓ పత్రికా రిపోర్టర్ కు ఫోన్ చేసి దుర్భాషలాడటంతో ఆయనపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 109, 448, 504, 506 3(2) కింద కేసు నమోదు చేశారు.

కాగా సంతోష్ నాయక్ అనే రిపోర్టర్ ను ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించినట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాళ్ళు, చేతులు నరికేస్తా, చంపుతా అంటూ చేసిన వ్యాఖ్యలు ఆడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయమై బాధితుడు సంతోష్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇక దీనిపై ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన మహిపాల్ రెడ్డి తాను రిపోర్టర్ తో ఆ విధంగా మాట్లాడింది వాస్తవమేనని తెలిపారు. సంతోష్ నాయక్ తనపై అసత్య రాతలు రాస్తున్నారని తెలిపారు. ఇలా రాయడం మూడోసారి అని వివరించారు. తనపై నమోదైన కేసులను దైర్యంగా ఎదురుకుంటానని వివరించారు. రిపోర్టర్ తనకు చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరించడంతోనే ఆ విధంగా దూషించాల్సి వచ్చిందని వివరించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు