కరోనా వ్యాక్సిన్ వస్తుంది అన్నది అబద్ధం – జీవితాంతం పోరాడాల్సిందేనా

సహజీవనం చేయాల్సిందే అంటున్నారు బాలయ్య

కరోనా.. గో కరోనా గో అంటే కూడా పోవటం లేదు.. అస్సలు పోదు.. పోయే పరిస్థితులు కూడా లేవు అంటున్నారు నట సింహం బాలయ్య. వ్యాక్సిన్ వస్తుంది అన్నది అబద్ధం అని.. అస్సలు వ్యాక్సిన్ రాదు అని.. రాలేదు అని తేల్చి చెప్పేశారు నందమూరి బాలయ్య. వ్యాక్సిన్ వస్తుంది అనే తప్పుడు ప్రచారం అని.. వ్యాక్సిన్ వచ్చే అవకావాలు లేవని చెప్పేశారు బాలయ్య. జీవితాంతం కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని.. ఇది నిజం అంటున్నారు బాలయ్య. చన్నీళ్లతో తలస్నానాలు చేయొద్దని.. ముఖ్యంగా అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు.

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతున్నాయి. మూడో దశ పరీక్షలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కరోనాకు వ్యాక్సిన్ రాదు అని.. రాలేదు అని బాలయ్య అనటం సంచలనంగా మారింది. హైదరాబాద్ కు చెందిన కంపెనీనే భారీ ఎత్తున పరిశోధనలు చేస్తోంది కూడా.. వచ్చే ఏడాది రావొచ్చు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పష్టం చేసింది.

మానవాళికి కరోనా, క్యాన్సర్ రెండూ కూడా ప్రమాదకరంగా మారాయని.. ఇవి రెండు సమాజం నుంచి పోవు అని.. వీటిని జీవితాంతం ఎదుర్కోవాల్సిందే.. సహజీవనం చేయాల్సిందే అంటున్నారు బాలయ్య

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు