జీహెచ్ఎంసీలో బ్యాలెట్ ఓటింగ్ తో ఏ పార్టీకి లాభం – నష్టం

జీహెచ్ఎంసీలో బ్యాలెట్ ఓటింగ్ తో ఏ పార్టీకి లాభం - నష్టం.. ఓటింగ్ విధానంపై అస్సలు ఆందోళన పడటం లేదు. ఇక బీజేపీకి ఇది అగ్నిపరీక్షే అని చెప్పొచ్చు. దుబ్బాకలోనూ ఈవీఎం విధానంలోనే ఓటింగ్ జరిగింది.

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి బ్యాలెట్ పద్దతిలో జరుగుతున్నాయి. 2016 ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించగా.. ఈసారి బ్యాలెట్ విధానాన్ని తీసుకొచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. బ్యాలెట్ విధానంపై కొన్ని పార్టీలు ఆందోళన చెందుతుండగా.. మరికొన్ని పార్టీలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హ్యాపీగా ఉంది. ఈవీఎం ఓటింగ్ విధానం వచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు, విమర్శలు చేసింది. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగుతుండటంతో.. సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు అయిన సీనియర్ సిటిజన్స్ అందరూ హస్తం గుర్తుకు ఓటు వేస్తారని.. ఇది కలిసి వస్తుంది అని భావిస్తున్నారు. బ్యాలెట్ విధానంలో ఓట్లు పెరుగుతాయని చెబుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీ అయితే ఏ విధానం అయినా ఓకే అంటోంది. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా ఓట్లు మాకే పడతాయి అంటోంది. విజయంపై ధీమాగా ఉంటూ.. ఓటింగ్ విధానంపై అస్సలు ఆందోళన పడటం లేదు.

బీజేపీకి ఇది అగ్నిపరీక్షే అని చెప్పొచ్చు. దుబ్బాకలోనూ ఈవీఎం విధానంలోనే ఓటింగ్ జరిగింది. జీహెచ్ఎంసీలో బ్యాలెట్ పద్దతిలో ఓటర్లు ఓటు వేయాల్సి రావటంతో.. తీవ్రంగా కష్టపడుతుంది. అవగాహన కల్పిస్తుంది. కమలం – హస్తం మధ్య తేడాను చెబుతూ ఓటర్లను ఆకర్షిస్తోంది. యువతకు పెద్దగా చెప్పాల్సిన పని లేకపోయినా.. సీనియర్ సిటిజన్లు, 70 ఏళ్లు పైబడిన వారిలో అవగాహన కల్పిస్తూ ఉంది. ఎందుకంటే అప్పటి తరం వారు కాగితంపై హస్తం కనిపిస్తే చాలు ముందూ వెనకా చూడకుండా ఓట్లు గుద్దేస్తారు.

బ్యాలెట్ ఓటింగ్ అయినా ఈవీఎం అయినా ఒకటే అని.. గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. ఓటింగ్ రోజున కానీ అసలు విషయం తెలియదు. బ్యాలెట్ ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అనేది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు