#జీహెచ్ఎంసీ టైట్ షెడ్యూల్ తో.. అమెరికా బిడెన్ వ్యూహంలో బండి సంజయ్

పిల్లల చదువు ముఖ్యమా.. ఎన్నికలు ముఖ్యమా.. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులు ఆర్థిక సాయం కోసం ఆఫీసుల చుట్టూ

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావటంతో అన్ని పార్టీల్లో హడావిడి ఏర్పడింది. నామినేషన్లకు మూడు రోజులు మాత్రమే అది కూడా 18, 19, 20 తేదీలు మాత్రమే ఉండటం.. ఆ తర్వాత ప్రచారానికి 10 రోజులు సమయం మాత్రమే ఉండటంతో.. బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
హైదరాబాద్ లోని 150 డివిజన్లలో ప్రచారాన్ని 10 రోజుల్లో పూర్తి చేయటం సాధ్యం కాదు. ఈ క్రమంలోనే అమెరికాలోని డెమోక్రాట్ల పార్టీ తరపున అధ్యక్షుడుగా ఎన్నిక అయిన బిడెన్ వ్యూహాన్ని అమలు చేయబోతుంది.

సిటీలో కరోనా ఉంది. ఐటీ ఉద్యోగులు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోం. అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీనికితోడు ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఉండే కుత్బుల్లాపూర్, రంగారెడ్డి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో డిజిటల్ ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పదుల సంఖ్యలో వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా పేజీలను మాట్లాడుకుంది.

ఇంటింటి ప్రచారం, పబ్లిక్ మీటింగ్స్, రోడ్ షోలు చేయటానికి సమయం లేకపోవటంతో.. డిజిటల్, సోషల్ మీడియా ప్రచారంపై దృష్టి పెట్టింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన బిడెన్ సైతం.. ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. మీరు ఇంట్లోనే ఉండి ఓటు వేయండి.. బయట కరోనా ఉంది అని మొదటి నుంచి ప్రచారం చేశారు. ఆయన వ్యూహం ఫలించింది. 60 శాతం ఓట్లు ఆయనకు అనుకూలంగా పడ్డాయి.
పిల్లల చదువు ముఖ్యమా.. ఎన్నికలు ముఖ్యమా.. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులు ఆర్థిక సాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే.. దాన్ని వదిలేసి ఎన్నికలకు వెళతారా.. ఇలాంటి స్లోగన్స్ తో బీజేపీ వ్యూహాత్మక ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు