భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసిన బండి సంజయ్

నిజం చెబుతూ ప్రమాణం చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ రాలేదని.. అంటే తప్పుడు లేఖ, నకిలీది అని

హైదరాబాద్ సిటీ పాతబస్తీ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిపై ఒట్టేసి నిజం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. వరద బాధితులకు 10 వేల రూపాయల సాయం ఆపాలని ఎలాంటి లేఖ రాయలేదని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. హైదరాబాద్ ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ప్రజలు అందరూ ఆనందంగా, సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.
వరద సాయం 10 వేల రూపాయలు ఆపాలని లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ఓ లేఖ ప్రచారం అయ్యింది. అది నకిలీది అని.. టీఆర్ఎస్ పార్టీనే కావాలని చేసినట్లు చెప్పారు. దీన్ని సవాల్ చేస్తూ.. అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తారా అని టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు.

సవాల్ విసిరిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. అనుకున్నట్లుగానే నవంబర్ 20వ తేదీ ఉదయం పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. నిజం చెబుతూ ప్రమాణం చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ రాలేదని.. అంటే తప్పుడు లేఖ, నకిలీది అని స్పష్టం అయినట్లు వివరించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు