బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశం కనిపిస్తుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని అందించిన సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే కేంద్ర పెద్దలు బండి సంజయ్ ఢిల్లీ రావాలని సందేశం పంపారు. దింతో ఆయన ఢిల్లీ పయనమయ్యారు. కరీంనగర్ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన సంజయ్ పార్టీని ముందుండి నడిపించడంలో విజయం సాధించారు. కార్పొరేటర్ గా రాజకీయం ప్రారంభించి. ఎంపీ స్థాయికి ఎదిగారు. ఎంపీగా గెలిచిన కొద్దీ రోజులకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు భుజాన వేసుకున్నారు. కేంద్ర పెద్దల వద్ద మంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గాలు ఏర్పడకుండా పటిష్ఠపరిచారు.

ఎప్పుడైతే సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టారో అప్పటినుంచి బీజేపీ పుంజుకుంది. దుబ్బాకలో అధికార పార్టీకి చెమటలు పట్టించింది. అనంతరం గ్రేటర్ పీఠంపై గురిపెట్టింది. అధికార పార్టీతో డీ అంటే డీ అని ప్రచారాన్ని హోరెత్తించారు. పార్టీలోని నేతలను కలుపుకొని వెళ్లడంలో బండికి మంచి పేరు ఉంది. యువనాయకులను, వాగ్దాటి గలవారిని గ్రేటర్ ప్రచారంలో వాడారు. ఓ వైపు బండి సంజయ్, మరోవైపు అరవింద్, ఇంకోవైపు నుంచి రఘునందన్ రావు.

ఈ ముగ్గురికి తోడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజాసింగ్ లు, ప్రచారాన్ని హోరెత్తించారు. గతంలో ఎన్నడూ లేని విదంగా 48 స్థానాల్లో విజయం సాధించారు. ఇక ఇంతటి విజయాన్ని అందుకోవడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అధికార పార్టీకి గ్రేటర్ పీఠం అందకుండా చేశారు. బండి సంజయ్ పగ్గాలు పట్టిన నాటి నుంచి పార్టీ పరుగులు పెడుతుందని భావించిన కేంద్ర పెద్దలు, ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.

అయితే కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరుగుపయనం అయిన వెంటనే బండికి కాల్ రావడం పలు అనుమానాలకు తావిస్తుంది. గ్రేటర్ పీఠం విషయంలో కేసీఆర్ కేంద్ర పెద్దలతో ఏమైనా చర్చించారా అనే ప్రశ్న తలెత్తుతుంది. బీజేపీ టీఆర్ఎస్ కలిసి మేయర్ ను ఎన్నుకుంటాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర పెద్దలతో గంటలసేపు చర్చించిన కేసీఆర్ మేయర్ పదవి గురించి ప్రస్తావించి ఉంటారని ఇక్కడి నాయకులు అంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఢిల్లీ వెళ్లడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే కేంద్రమంత్రి,. లేదంటే టీఆర్ఎస్ తో కలిసి మేయర్ ఏర్పాటు.. ఈ రెంటి విషయంలో చర్చ కోసమే బండి ఢిల్లీ వెళ్లినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి విషయాలు రెండు మూడు రోజుల్లో బయటకు రానున్నాయి.

 

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు