మీ బండారం బయటపెడతా.. సీఎంలు కేసీఆర్, జగన్ కు బండి సంజయ్ వార్నింగ్

మీ బండారం బయటపెడతా.. సీఎంలు కేసీఆర్, జగన్ కు బండి సంజయ్ వార్నింగ్

మీ బండారం బయటపెడతా.. సీఎంలు కేసీఆర్, జగన్ కు బండి సంజయ్ వార్నింగ్

తెలంగాణ – ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి నీళ్ల విషయం హైడ్రామా ఆడుతున్నారని.. వీళ్లద్దరి బండారం త్వరలోనే బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే.. సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ 299 టీఎంసీలకే ఎలా ఒప్పుకుంటాడని ప్రశ్నించాడు.

తెలంగాణ భూభాగంలో 68 శాతం కృష్ణా పరివాహక ప్రాంతం ఉంటే.. అత్యధిక వాటా ఏపీకి కేటాయిస్తుంటే ఎలా మౌనంగా ఉన్నారని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

ఏపీకి 512 టీఎంసీలు కేటాయించటం వెనక తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.

200.9.2016న జరిగిన మొదటి అపెక్స్ కమిటీ సమావేశంలోనే కేసీఆర్ సంతకం చేశారని.. మళ్లీ అదే విషయంపై గెజిట్ విడుదల చేసిందని తెలిపారు. అపెక్స్ కమిటీలో ఎందుకు కొట్లాడలేదని నిలదీశారు.

ఏపీ ప్రభుత్వం శ్రీశైలం దగ్గర కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతుంటే.. సీఎం కేసీఆర్ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని.. ఇద్దరు సీఎంలు కలిసి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ, తెలంగాణ సీఎంలు తూట్లుపొడుస్తూ.. నీటి రాజకీయాలు చేస్తున్నారని.. కృష్ణా నది నీటి వాటాపై సీఎం కేసీఆర్ స్వయంగా హక్కును వదులుకున్నారని విమర్శించారు. నీటి వాటాపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆడుతున్న నాటకాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు బండి సంజయ్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు