బండ్ల గణేష్ కు రెండోసారి కరోనా.. ఐసీయూలో వెంటిలేటర్ తో చికిత్స

బండ్ల గణేష్ కు రెండోసారి కరోనా.. ఐసీయూలో వెంటిలేటర్ తో చికిత్స

Bandla ganesh got corona for 2nd time
Bandla ganesh got corona for 2nd time

బండ్ల గణేష్ కు రెండోసారి కరోనా.. ఐసీయూలో వెంటిలేటర్ తో చికిత్స

సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్ రెండో సారి కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్ 13వ తేదీ ఉగాది రోజున.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతుండగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.

బండ్ల గణేష్ కు కరోనా 4 పాయింట్లపైనే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఓసారి కరోనాతో ఆస్పత్రికి చికిత్స తీసుకున్నారు. ఇది రెండోసారి. దీనికితోడు శ్వాస సంబంధమైన అనారోగ్య సమస్యలు తలెత్తటంతో.. ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి.. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏడాది క్రితం కరోనా బారిన పడిన వారిలో బండ్ల గణేష్ మొదటి వ్యక్తి. ఇక రెండో సారి.. అతనే ఫస్ట్ కావటం చర్చనీయాంశం అయ్యింది. ఇటీవలే బండ్ల గణేష్ పవన్ కల్యాణ్ మూవీ వకీల్ సాబ్ ప్రీ రిలజీ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. మరో వారం రోజులు అయినా ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా రెండుసారి రావటం అంటే.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు