మోడీకి షాక్ ఇచ్చిన బెంగాళ్ : ప్రచారం 16 నియోజకవర్గాల్లో :14 స్థానాల్లో ఓడిపోయిన బీజేపీ..

mamatha vs modi in bengal

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. పశ్చిమబెంగాల్ పైనే బీజేపీ బాగా ఫోకస్ చేసింది. కరోనాను సైతం లెక్కచేయకుండా.. భారీ ర్యాలీలు, సభలు నిర్వహించింది బీజేపీ. ప్రధానమంత్రి మోడీ బెంగాల్ రాష్ట్రంలో ఏకంగా 16 సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఏ ప్రధాని ఓ రాష్ట్ర ఎన్నికల్లో ఇన్ని సభల్లో పాల్గొనటం ఇదే ప్రథమం కూడానూ.. అంటే బీజేపీ ఎంత సీరియస్ గా ఈ ఎన్నికలను తీసుకుందో దీంతోనే అర్థం అయిపోతుంది.

పశ్చిమబెంగాల్ ఫలితాలు వచ్చిన తర్వాత.. బీజేపీ వ్యూహం అంతా బోల్తా కొట్టింది. ప్రధాని మోడీ ప్రచారం చేసిన 16 నియోజకవర్గాల్లో.. 14 సీట్లలో ఓడిపోయింది బీజేపీ. కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే గెలిచింది. మోడీ ప్రచారం చేసింది ఆయా నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ పార్టీ గెలుపొందింది. ఇదే ఇప్పుడు బెంగాల్ బీజేపీని వేధిస్తోంది. మోడీ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు.

బెంగాల్ పై బోలెడు ఆశలు పెట్టుకోవటం వేరు.. మోడీ ప్రచారం ఓ ఎత్తు. బీజేపీ ఐకాన్.. మార్గదర్శకుడు అయిన మోడీ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోనే చిత్తుగా ఓడిపోతే రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఏంటీ అనేది డైలమా ఏర్పడింది. బెంగాల్ లో ఓడిపోవటం కంటే.. మోడీ ఓడిపోవటం ఏంటీ అనే రివ్యూ ఇప్పుడు బీజేపీలో జరుగుతుంది.

See also : అమ్మ లేకపోయినా అల్లాడించిన అన్నాడీఎంకే : స్టాలిక్ కు చుక్కలు చూపించారు.. ఎవరూ ఊహించలేదే..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు