అర్థరాత్రి బెంజ్ కారు బీభత్సం – బుల్లెట్ పై వెళుతున్న భర్త మృతి, భార్యకు సీరియస్

కాశీ విశ్వనాథ్‌ అనే వ్యక్తి బెంజ్‌ కారు డ్రైవ్ చేస్తున్నాడు. అతనితో పాటు

హైదరాబాద్ సిటీలో అర్థరాత్రి ఓ బెంజ్ కారు ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యంగానికి ఓ కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యింది. గురువారం రాత్రి 11 – 12 గంటల మధ్య.. ఓ పబ్ లో మద్యం తాగి బెంజ్ కారులో వస్తున్న కాశీ విశ్వనాథ్, కౌశిక్ ఓవర్ స్పీడ్ గా వెళుతూ మాదాపూర్‌ సైబర్‌ టవర్‌ సిగ్నల్‌ దగ్గర ఓ బుల్లెట్ ను ఢీకొన్నారు.

ఈ యాక్సిడెంట్ లో బైక్ పై ఉన్న గౌతమ్ దేవ్ అక్కడికక్కడే చనిపోయాడు. భార్య శ్వేతకు తీవ్రగాయాలు కావటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో కాశీ విశ్వనాథ్‌ అనే వ్యక్తి బెంజ్‌ కారు డ్రైవ్ చేస్తున్నాడు. అతనితో పాటు మిత్రుడు కౌశిక్‌ ఉన్నాడు. కారు నిర్లక్ష్యంగా, ఓవర్ స్పీడ్ గా నడిపి ఒకరి మృతికి కారణమైన కాశీ విశ్వనాథ్‌ను మాదాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిగ్నస్ జంప్ చేసి మరీ రావటం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు చెబుతున్నారు పోలీసులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు