బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఎగ్జిట్ పోల్స్ లో తేజస్వికి పట్టం

బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు. అనూహ్యంగా మారిన పరిణామాలు

243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీకి మూడో దశ పోలింగ్ శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది, ఇక ప్రస్తుతం అందరి ద్రుష్టి ఎగ్జిట్ పోల్స్‌పై ఉంది. మహమ్మారి మధ్య దేశంలో మొదటి ప్రధాన ఎన్నికలకు వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు సాయంత్రం 6.30 తరువాత ప్రారంభమవుతాయి.

మొదటి దశ ఓటింగ్ అక్టోబర్ 28 న, రెండవ దశ నవంబర్ 3 న జరిగింది. ఇక వీటి ఫలితాలు నవంబర్ 10 న ప్రకటించబడతాయి. ఓటర్ ఓటు వేసిన తరువాత బయటకు వెళ్లిన వెంటనే తీసుకున్న ఓటర్ల పోల్. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో సూచికగా ఇది చెబుతుంది.

ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కె మరోసారి బీహార్ ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. జనతాదళ్, బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని సర్వేలు చెబుతున్నాయి.

టైమ్స్ నౌ సర్వేలో RJDకి పట్టం కట్టినట్లు తెలిపింది. మొత్తం 243 స్థానాల్లో 108 నుంచి 131 సీట్లు RJD సారథ్యంలోని మహా గట్బంధన్ కు వస్తాయని పేర్కొంది. ఏబీపీ సర్వే కూడా తేజస్వి యాదవ్ సీఎం అవుతారని చెబుతుంది. ఇక మరికొందరు జరిపిన సర్వేలో బీజేపీ, జనతాదళ్ కూటమి 140 సీట్లకు పైనే గెలుస్తుందని తెలిపారు.

ఇక ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10 న రానున్నాయి. అదే రోజు తెలంగాణలోని దుబ్బాక ఎన్నికల ఫలితాలతోపాటు ఉత్తరప్రదేశ్ లోని ఏడూ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కూడా రానున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు