ప్రపంచానికి ఆదర్శంగా భూటాన్ దేశం.. భారత్, అమెరికా, ఇంగ్లాండ్ కంటే బెటర్

bhutan became role model for india

అదో చిన్న దేశం.. హిమాలయ పర్వతాల్లో ఉండే ప్రశాంతమైన కంట్రీ. మొత్తం జనాభా 7 లక్షల 50 వేల మంది. వీళ్లందరూ కొండల్లో, గుట్టల్లో చాలా రిమోట్ ఏరియాల్లో ఉంటారు. అలాంటి దేశం కరోనాను అరికట్టటంలో.. ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వటంలో ప్రపంచ దేశాలకు ఆదర్శం నిలచింది.

భూటాన్ దేశం ఇప్పటికే 4 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేసింది. ప్రతి 100 మందిలో 63 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రకటించింది. మొదటి డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి కావటానికి ఎనిమిది వారాల గడువు పెట్టుకుంది. అంటే రెండు నెలలు మాత్రమే. అదే విధంగా రెండో డోస్ ఇవ్వటానికి 8 వారాల టైం విధించింది. అంటే నాలుగు నెలల్లో భూటాన్ దేశం మొత్తం వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. మార్చి 25వ తేదీన మొదలైన వ్యాక్సిన్ ప్రక్రియ.. జూలై నెలాఖరుకు పూర్తవుతుంది. మే 15వ తేదీలోపు మొదటి దశ వ్యాక్సిన్ పూర్తి చేస్తామని భూటాన్ దేశపు ఆరోగ్య మంత్రి వెల్లడించారు.

భూటాన్ దేశానికి ఇండియా నుంచి కోవీషీల్డ్, ఆక్స్ ఫర్డ్ కు చెందిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఇస్తున్నారు. మార్చి మూడో వారంలో ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా వ్యాక్సిన్ తెప్పించుకుంది భూటాన్ దేశం. దేశవ్యాప్తంగా 12 వందల కమిటీలను ఏర్పాటు చేసుకుంది. వారి ద్వారా ప్రతి గ్రామానికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు మరణించటంతో కొంత మంది వ్యతిరేకించారు.. భయపడ్డారు. వాళ్లను మత బోధకులు కౌన్సెలింగ్ ఇచ్చి.. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించారు.

ఈ విధంగా భూటాన్ దేశం వ్యాక్సినేషన్ లో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అమెరికా, ఇంగ్లాండ్ కంటే వేగంగా.. ఇండియా కంటే ఏడు రెట్లు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది భూటాన్ దేశంలో. ఈ ప్రక్రియ మొత్తాన్ని భూటాన్ రాజు ఏ రోజుకు ఆ రోజు సమీక్షిస్తున్నారు. 12 వందల హెల్త్ కమిటీలు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వటంతోపాటు.. వ్యాక్సినేషన్ లో వచ్చే ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఆ సమస్య పరిష్కారానికి ఏర్పాటైన అత్యున్నతస్థాయి కమిటీ.. వెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించి.. వ్యాక్సిన్ ప్రక్రియను ముందుకు తీసుకెళుతుంది.

చాలా చిన్న దేశం అయినా.. కరోనాను అరికట్టటంలో.. వ్యాక్సిన్ వేయించటంలో భూటాన్ దేశం చాలా అద్భుతం.. అందరికీ అదర్శంగా ఉందని అమెరికా రీసెర్చ్ సెంటర్ కొనియాడింది. వ్యాక్సిన్ ను వేగవంతంగా ఇస్తున్న దేశాల్లో భూటాన్ ఆరో స్థానంలో ఉంది అంటే.. ఎంత చక్కగా ప్లానింగ్ చేశారో అర్థం అవుతుందని.. ఆరోగ్యంపై ఆ దేశానికి ఉండే శ్రద్ధకు హ్యాట్సాప్ అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

అన్నీ కొండలు, గుట్టలు, రవాణా కూడా సరిగా లేని ప్రాంతాల్లోకి కాలి నడకన వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు అని.. మిగతా దేశాల్లో అలా లేదని చెబుతున్నారు. ఇది కచ్చితంగా భూటాన్ దేశపు సక్సెస్ స్టోరీ.. ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్ తీసుకుని.. ఇంత సమర్థవంతంగా చేయటం అద్భుతం అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు