బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం – భయంతో పరుగులు తీసిన జనం

బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం - భయంతో పరుగులు తీసిన జనం

శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని సింగ్‌నగర్‌ పైపుల రోడ్డు వద్ద ఉన్న దుర్గా బార్ వద్ద నలుగురు బ్లేడ్ బ్యాచ్ సభ్యులు వీరంగం సృష్టించారు. నలుగురు సభ్యులు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. నాగరాజు అలియాస్ పండు, హుస్సేన్ , రఫీ, కిశోర్ బాబు అనే ఈ నలుగురికి గురువారం సాయంత్రం వంద రూపాయల విషయం గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నలుగురు విజయవాడ వాంబే కాలనీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

గురువారం నాటి సాయంత్రం జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ఈ నలుగురు పైపుల రోడ్డు వద్ద మరోసారి గొడవకు తెగబడ్డారు. గొడవ జరిగిన సమయంలో నలుగురు పూర్తిగా గంజాయి మత్తులో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ నలుగురిలో నాగరాజు అనే వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందగా,గాయపడిన మరో ముగ్గురిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం – భయంతో పరుగులు తీసిన జనం

అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న దుర్గ బార్ – పైపుల రోడ్డు ప్రాంతం ఈ నలుగురి గొడవ కారణంగా భయంకరంగా మారింది. ఒకరి పీకలు మరొకరు కోసుకుంటూ భీభత్సం సృష్టించడంతో అక్కడి జనం భయంతో పరుగులు తీశారు. చాలా సేపు ఒకరిపై ఒకరు దాడి చేసుకోని సొమ్మసిల్లి పడిపోవడం, ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కొద్దిగా ప్రశాంత నెలకొంది. 100 రూపాయల గొడవ, గంజాయి మత్తు వెరసి ఒకరి ప్రాణం తీసాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు