ఒక్కటైన కమ్మ, రెడ్డి వ్యాపారులు – రియల్ ఎస్టేట్ కథనాలపై రహస్య మంతనాలు – బతకనిచ్చేలా లేరంటూ చర్చలు

ఒక్కటైన కమ్మ, రెడ్డి వ్యాపారులు - రియల్ ఎస్టేట్ కథనాలపై రహస్య మంతనాలు - బతకనిచ్చేలా లేరంటూ చర్చలు

రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార లావాదేవీలు, కొనుగోళ్లు, అమ్మకాళ్లపై కొన్ని రోజులుగా ఓ న్యూస్ ఛానల్ లో వస్తున్న కథనాలతో.. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా 10 వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఆగిపోయాయి. ఇది ఆషామాషీ ఫిగర్ కాదు.. కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో పడి దెబ్బ.. దీని వల్ల ఇప్పటికే 10 వేల మంది ఉపాధి కోల్పోగా.. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. జనంలోని భయాన్ని క్యాష్ చేసుకుంటూ వస్తున్న కథనాలతో.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఇన్నాళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాంపిటీషన్ పరంగా బలంగా ఉన్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వ్యాపారాలు ఇప్పుడు ఒక్కటిగా.. సమస్యను ఎదుర్కోవటానికి సన్నద్ధం అయ్యారు.

రెండు వారాలుగా రియల్ ఎస్టేట్ రంగంపై ఓ న్యూస్ ఛానల్ లో వస్తున్న స్టోరీలతో దెబ్బతిన్న.. తింటున్న వ్యాపారాలను గాడిన పెట్టుకునేందుకు.. పెట్టుబడిని సేఫ్ గా రాబట్టుకునేందుకు రహస్యంగా సమావేశం అయ్యారు. రెండు, మూడు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలనే టార్గెట్ చేసుకుని స్టోరీలు రావటం వెనక ఏమైనా కుట్ర ఉందా అనే చర్చ ఈ సమావేశంలో జరిగిందంట.

ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం కొత్తది కాదు.. ఇస్తున్న ఆఫర్స్ లో వింతా లేదు.. అందరూ చేసేది.. అన్ని సంస్థలు చేస్తున్నవే.. అయినా పనిగట్టుకుని బురద జల్లటం ఏంటీ అనేది సమావేశంలో ప్రధానమైన చర్చ. తక్కువ లాభాలతో.. కస్టమర్ల ప్రయోజనాలే ముఖ్యంగా.. ప్రీలాంఛ్ పేరుతో గతంలోనూ ఇచ్చాం.. ఇప్పుడూ ఇస్తున్నాం.. ఈ విధానం ఒక్క తెలంగాణలోనే లేదు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, పూణె వంటి మహా నగరాల్లో ప్రీలాంచ్ పేరుతో కస్టమర్లకు తక్కువ ధరకే అందిస్తున్నాం.

ఈ విధానంలో మోసం జరిగినట్లయితే.. 30 వేల కోట్ల రూపాయల స్కాం జరిగింది అనుకుంటే.. పోలీస్ కేసు నమోదు అయ్యి ఉండాలి.. ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాలి.. కోర్టుల్లో కేసులు వేసి ఉండాలి.. రెరాకు ఫిర్యాదులు వెళ్లాలి.. అలాంటివి ఏవీ జరగలేదు కదా.. అయినా ఎందుకు ఇలా టార్గెట్ గా వార్తలు వస్తున్నాయి అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారంట.

రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు ఉంటాయి.. అది చాలా తక్కువ. వెయ్యి మందిలో ఒకరు, ఇద్దరికి నష్టం వచ్చి ఉండొచ్చు.. కానీ 98 మంది లాభాలు లేదా అసలుతో అయినా బయటపడినవారే.. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో మోసం, నష్టాల బారిన పడిన వారు కేవలం 4 శాతంగానే ఉంది.

ఓ న్యూస్ ఛానల్ లో కథనాలు చూస్తుంటే.. 30 వేల కోట్ల స్కాం అంటే.. కనీసం లక్ష మంది అయినా మోసపోయి ఉండాలి కదా.. అంత మంది నష్టపోయినా.. మోసపోయినా.. దేశవ్యాప్తంగానే చర్చ జరగాలి కదా.. మిగతా ఛానల్స్ అయినా దాన్ని హైలెట్ చేస్తాయి కదా.. ఇలాంటివి ఏవీ జరగక్కుండానే.. కావాలనే ఉద్దేశంతోనే వార్తలు వేస్తున్నారు అనే స్పష్టతకు వచ్చారంట.

ఓ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన వార్తల్లోని కంపెనీలు అన్నీ యాదృచ్ఛికమో లేక టార్గెట్ ఏమోగానీ.. రెడ్డి, కమ్మ, వైశ్య సామాజికవర్గాలకు చెందిన కంపెనీలే కావటం విశేషం. అందుకే ఇప్పుడు ఆ ముగ్గురి ఒక్కటిగా రహస్య మంతనాలు చేశారు. వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి భవిష్యత్ పై చర్చించుకున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు