సముద్రంలో ట్రాఫిక్ జామ్ – నిండా ముంచిన ఓడ : మూడు రోజుల నుండి గంటకు 2 వేల కోట్ల నష్టం

biggest vessel ever green struck in suez canal

రోడ్ల మీదలా కాకుండా ప్రశాంతంగా ప్రయాణలు సాగే సముద్రం మార్గంలో ప్రమాదం జరిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడితే ఎలా ఉంటుందో తెలిసి వచ్చేట్టు చేసింది ఒక ఓడ. ఎవర్ గ్రీన్ అనే పేరు పెట్టుకున్న ఈ నౌక ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. అత్యంత రద్దీగా, నిత్యం వందలాది ఓడలు తిరుగుతూ ఉండే సూయూజ్ కెనాల్ లో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయి, వందలాది ఓడలు నిలిచిపోవడానికి కారణం అయింది.

మంగళ వారం ఉదయం ప్రమాదం జరగడంతో సుయజ్ కెనాల్ ఇసుక తిన్నెల్లో ఈ అతిపెద్ద ఓడ ఇరుక్కుపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా సముద్రమార్గం ద్వారా జరిగే 12% వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. సూయజ్ కెనాల్ వెడల్పు కేవలం 30 మీటర్లే కావడంతో ఈ మార్గం నుండి వేరే ఓడలు వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. ఇక్కడ ప్రమాదానికి గురైన ఎవర్ గ్రీన్ ఓడను బయటకు తీస్తేనే ఇతర పడవలు ఈ మార్గం నుండి వెళ్లడానికి సాధ్యం అవుతుంది.

ఈ ఒక్క పడవ కారణంగే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్రతి రోజు తక్కువలో తక్కువ 60వేల కోట్ల రూపాయల వాణిజ్యాన్ని కోల్పోతున్నాయి. గడచిన మూడు రోజుల్లో దాదాపు ఒక లక్షా 80 వేల కోట్ల రూపాయల మేర వాణిజ్యం నిలిచిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఓడ పొడవు కంటే సుయజ్ కెనాల్ వెడల్పు తక్కువ గా ఉన్న కారణంగా ఈ ఓడను రెస్క్యూ చేయడం అంత సులభం కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. సరైనా జాగ్రత్తలు, ప్రణాళిక లేకుండా రెస్క్యూ ఆపరేషన్ చేపడితే మొత్తం షిప్ నాశనం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓడకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ ఎంత ఆలస్యం జరిగితే ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం విషయంలో అంత నష్టం జరిగే అవకాశం ఉంది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు