చెమటే.. ఆ బిర్యానీకి టేస్ట్ అంట.. బహిరంగంగానే చెమట.. లోపల ఇంకేం కలుపుతున్నాడో.. బిలాల్ బిర్యానీ నిర్వాకం

చెమటే.. ఆ బిర్యానీకి టేస్ట్ అంట.. బహిరంగంగానే చెమట.. లోపల ఇంకేం కలుపుతున్నాడో.. బిలాల్ బిర్యానీ నిర్వాకం

బిర్యానీ అంటే లొట్టలేసుకుని తింటాం.. అది ఎలా తయారవుతుందో.. తయారు చేసే ప్లేస్ అదేనండీ కిచెన్.. వంట గది ఎలా ఉందో ఎవరూ చూడరు.. బిర్యానీ తయారు చేసే సిబ్బంది ఎలా ఉన్నారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది చూడం.. బిర్యానీ కనిపిస్తే చాలు.. ఆహా ఏమి రుచి అంటూ తినేస్తాం.. అదే బిర్యానీ కోసం వెళ్లిన ఓ కస్టమర్ కు.. అక్కడి సిబ్బంది నిర్వాకం, అపరిశుభ్రత, కనీస జాగ్రత్తలు లేకుండా ఉండటం చూస్తే ఎలా ఉంటుంది.. సాధారణ మనుషులకు అయితే వాంతు వస్తుంది.. ఇంకా బీపీ రైజ్ అయితే అక్కడే నిలదీస్తాడు.. ఎందుకంటే జనం ఆరోగ్యంతో.. కస్టమర్ ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటీ..

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని రాంనగర్ 10వ లైన్ లో ఇటీవలే బిలాల్ బిర్యానీ అని ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. కొత్తగా ఓపెన్ చేశారు.. బిర్యానీ ఎలా ఉందో తెచ్చుకుని తిందాం అని ఓ కస్టమర్ వెళ్లాడు. బయటే బిర్యానీని పార్శిల్ చేసి ఇస్తున్న సిబ్బందిని చూసి షాక్ అయ్యారు. ముగ్గురు సిబ్బంది.. మాస్క్ లేకుండా.. చెమటలు కక్కుతూ.. అదే చెమట బిర్యానీలో పడుతున్నా పట్టించుకోకుండా బిర్యానీ పార్శిల్ చేస్తున్నారు.

ఇదంతా చూసి షాక్ అయిన కస్టమర్.. బాబూ మాస్క్ పెట్టుకో.. నీ చెమట బిర్యానీలో పడుతుంది అంటూ వర్కర్లకు చెప్పాడు. ఏయే.. ఏం మాట్లాడుతున్నావ్ రా.. చెమట పడితే బిర్యానీకి బాగా టేస్ట్ వస్తుంది.. మూసుకుని బిర్యానీ తీసుకెళ్లు.. లేకపోతే నీ డబ్బులు నువ్వుతీసుకెళ్లు అంటూ కస్టమర్ పైనే ఎదురుదాడి చేశారు. కాదయ్యా.. కరోనా కాలం.. మాస్క్ పెట్టుకోలేదు.. దీనికితోడు నీ చెమట అంతా అందులోనే పడుతుంది అని మంచిగా.. ఓపికగా.. ఎంతో హుందాగా చెప్పబోయిన కస్టమర్ పైనే దాడి చేసేంత పని చేశారు..

ఇక్కడ విశేషం ఏంటో తెలుసా.. చెమట పడుతుందని.. మాస్క్ లేదని ప్రశ్నిస్తున్న కస్టమర్ చుట్టూ కనీసం 20 మంది పార్శిల్ కోసం వెయిట్ చేస్తున్నారు.. ఒక్కరు కూడా ప్రశ్నించిన కస్టమర్ కు సపోర్ట్ రాకపోగా.. చెమట పడిన, మాస్క్ లేకుండా మాట్లాడుతున్న సిబ్బంది తుంపర్లు పడిన బిర్యానీని పార్శిల్ ను ఇంటికి తీసుకెళ్లి సొంగ కార్చుకుంటూ తిన్నారంట.

కాకపోతే ప్రశ్నించిన కస్టమర్ మాత్రం తన డబ్బులు రిటర్న్ తీసుకుని.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మున్సిపల్ ఫుడ్ అధికారులు యధావిధిగా వచ్చి తనిఖీ చేసి వెళ్లారు. ఆ ఫుడ్ ఇన్ స్పెక్టర్ ఏమన్నాడంటే.. రంగు కలిపిన చికెన్ ఉంటే దాన్ని బయటకు పారేయించాను అని.. అంటే క్వాలిటీ లేదు అని నిర్థారించుకున్న తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా నోటీస్ ఇచ్చి రన్ చేయించుకోండి అని అధికారులు చెప్పారు.

మొత్తానికి చెమట బిర్యానీకి టేస్ట్ ఎక్కువ అన్నట్లు పట్టుకుపోతున్నారు జనం. ఎవరి టేస్ట్ ఎవరికి తెలుసు.. బహిరంగంగానే చెమట బిర్యానీ అమ్ముతున్నాడు.. అదే కిచెన్ లో ఇంకేం పోస్తున్నాడో ఏమో కదా.. ఎవరు చూశారు.. తినేవాడికి లేని సిగ్గు.. కలిపివాడికి ఉంటుందా ఏంటీ చెప్పండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు