తెలుగు సినీ ఇండస్ట్రీకి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వార్నింగ్

ఓ ఎంపీ అయ్యి ఉండి.. బండి సంజయ్ ఇలాంటి పరుష పదజాలాలు ఉపయోగించటం ఏంటనీ తెలుగు సినీ ఇండస్ట్రీనే అసహనంగా ఉంది.

కొమురం భీం అడవి బిడ్డ.. ఉద్యమకారుడు అనటంలో సందేహం లేదు.. చరిత్ర చెప్పిన సత్యం ఇదే. కొమురం భీం పాత్ర ఆధారంగా రాజమౌళి తీస్తున్న ట్రిబుల్ మూవీపై బీజేపీ రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. కొమురం భీంకి టోపీ పెట్టటాన్ని తప్పుబడుతున్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అంశంలో స్పందించనే లేదు రాజమౌళి.

ఓ పోస్టర్ చూసి బీజేపీ తప్పుడు అభిప్రాయానికి ఎలా వస్తుంది.. సినిమా అనేది కల్పిత పాత్రలతో.. కథకు అనుగుణంగా ఉంటుంది. ఇదేమీ తెలియకుండా ఓ పార్టీ అధ్యక్షుడి హోదాలో.. సినిమా ఇండస్ట్రీపై నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటీ

ఆ పాత్ర అభ్యంతరకరం అనుకుంటే అందుకు సెన్సార్ ఉంది.. కోర్టులు ఉన్నాయి. ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే విడుదలకు ముందే కట్ చేస్తారు.. అడ్డుకుంటారు.
బీజేపీ వాళ్లు కానీ.. బండి సంజయ్ కానీ సినిమా చూడలేదు.. కథ తెలియదు. అదో కల్పిత పాత్రలతో తెరకెక్కిన పాత్రల అడ్డంపెట్టుకుని తెలుగు సినీ ఇండస్ట్రీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏంటని సినీ ఇండస్ట్రీనే ఆశ్చర్యపోతుంది.

పద్మావతి సినిమా సమయంలోనూ ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలాబన్సాలీపై ఇదే స్థాయిలో రెచ్చిపోయారు.. తీరా సినిమా విడుదల అయ్యాక గప్ చుప్. రెండు నెలల రాజకీయం ఏమైపోయిందో.. అసలు సినిమాలో వాళ్లు ఊహించుకున్న సీన్లు లేవని తేలిపోయిన తర్వాత పత్తాలేరు.

నిజంగానే పొరపాటు అయ్యింది అనుకుంటే ఈపాటికే దర్శకుడు రాజమౌళి స్పందించి ఉండేవారు కదా.. అలా జరగలేదు అంటే.. పాత్రకు – ఆ టోపీకి సంబంధమే లేదు అని స్పష్టం అవుతుంది కదా..

ఒక్క టోపీతో మతతత్వాన్ని రెచ్చగొట్టి.. దీనికి హిందూ – ముస్లిం ముసుగు వేసి.. ప్రజల్లో అపోహలు సృష్టించటం ఎంత వరకు కరెక్ట్. ఓ ఎంపీ అయ్యి ఉండి.. బండి సంజయ్ ఇలాంటి పరుష పదజాలాలు ఉపయోగించటం ఏంటనీ తెలుగు సినీ ఇండస్ట్రీనే అసహనంగా ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు