టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నా.. బీజేపీ ఓట్లు భారీగా పెరిగాయి

టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నా.. బీజేపీ ఓట్లు భారీగా పెరిగాయి..ప్రతి డివిజన్ లోనూ పోరాటం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేసింది. గత రెండు ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పాత్రను.. ఈసారి బీజేపీ తీసుకోవటం విశేషం.

bjp campaign in ghmc elections
bjp campaign in ghmc elections

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలక ఘట్టం అయిన పోలింగ్ ముగిసింది. 2016 ఓట్లతో పోల్చుకుంటే 2020 ఎన్నికల్లో కనీసం 45 శాతం పోలింగ్ తగ్గింది. గత ఎన్నికల్లో 35 నుంచి 40 శాతంగా వరకు మాత్రమే ఓట్లు పోలయ్యాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కరోనా కారణంగా సిటీ నుంచి లక్షల మంది వెళ్లిపోవటం ప్రధాన కారణం. ఇక పోలైన ఓట్లను పరిశీలిస్తే.. తగ్గిన ఓట్లతో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ కాబోతుంది. పోలింగ్ శాతం ఎక్కువగా ప్రతిపక్షానికి ప్లస్ అవుతుందని గతంలోని అనేక ఎన్నికల్లో రుజువు అయ్యింది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యంత తక్కువగా ఓట్లు పోల్ అయ్యాయి.. అంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం అని భావిస్తున్నారు. కనీసంలో కనీసం 70 సీట్లలో గెలుపు ఖాయం అని.. 80 సీట్లు డివిజన్లలో విజయం ఖాయం అని అంచనా వేస్తున్నారు.

పోలింగ్ తగ్గినా.. బీజేపీ మాత్రం భారీగా ఓట్లను రాబట్టుకున్నది. ఆయా పోలింగ్ బూతుల దగ్గర పరిస్థితిని అంచనా వేసిన నిపుణులు ఇదే మాట అంటున్నారు. గతంలో కొన్ని డివిజన్ల వరకు మాత్రమే బీజేపీ పరిమితం అయ్యింది.. ఈసారి అన్ని డివిజన్లలో గౌరవ ప్రదమైన ఓట్లను రాబట్టుకున్నది.

సీట్లను గెలవకపోవచ్చు.. ఓట్లను మాత్రం భారీగానే రాబట్టుకున్నట్లు స్పష్టం అయ్యింది. 2016 ఎన్నికల్లో కేవలం 4 డివిజన్లలోనే గెలిచింది బీజేపీ.. అంతకు ముందు 2009లోనూ 4 డివిజన్లకే పరిమితం అయ్యింది. పదేళ్లుగా నాలుగు డివిజన్లకు మించి గ్రేటర్ ఎన్నికల్లో గెలవలేదు బీజేపీ. ఈసారి మాత్రం అంతకు రెట్టింపు స్థాయిలో అంటే 8 నుంచి 15 డివిజన్లలో గెలిచినా ఆశ్చర్యం లేదన్నట్లు ప్రచారం జరిగింది.

బీజేపీకి మరో ఆనందకరమైన విషయం ఏంటంటే.. పదేళ్లుగా పెరగని ఓటింగ్ శాతం ఈసారి గణనీయంగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లోనూ బీజేపీ ఓట్లు పడ్డాయి. ప్రతి డివిజన్ లోనూ పోరాటం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేసింది. గత రెండు ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పాత్రను.. ఈసారి బీజేపీ తీసుకోవటం విశేషం.

డిసెంబర్ 4వ తేదీ ఫలితాలు ఎలా ఉన్నా.. బీజేపీ ఓటు బ్యాంక్ మాత్రం భారీగా పెరగటం ఆ పార్టీకి ఆనందాన్ని ఇచ్చేదే.. 2023 ఎన్నికలకు ఇది కిక్క్ ఇచ్చినట్లే.. ఓటు వరకు తీసుకు రావటం అంటే మాటలు కాదు కదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు