జీహెచ్ఎంసీ ఎన్నికలకు కేంద్ర బలగాలను రప్పించండి

జీహెచ్ఎంసీ ఎన్నికలకు కేంద్ర బలగాలను రప్పించండి.. కుతంత్రాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. ప్రత్యేకంగా అదనపు బలగాలను రప్పించాలని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ బలగాలతోనే శాంతి భద్రతలను

BJP lakshman meets Governer
BJP lakshman meets Governer

హైదరాబాద్ లో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శాంతి భద్రతలు, సెక్యూరిటీ అంశంపై కేంద్ర బలగాలు రానున్నాయా.. కేంద్రం బలగాలు దిగుతున్నాయా.. ఇదే అందరిలో చర్చ. దీనికి కారణం లేకపోలేదు. వారం రోజులుగా జరుగుతున్న ప్రచారంలో.. పార్టీ నేతల మధ్య మాటలు హద్దులు దాటి.. శాంతి భద్రల అంశం హైలెట్ అయ్యింది. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దలు అందరూ కలిసి గవర్నర్ తమిళిసైని కలిసి వినతిపత్రం ఇచ్చారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ.. హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించటానికి ప్రయత్నిస్తోందని.. వీటిని అడ్డుకోవాలి అంటే ప్రత్యేక బలగాలను రప్పించాలని కోరారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించి.. ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని.. ఓటమిని తప్పించుకునేందుకు ఏమైనా చేయటానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ ను కలిసి వివరించారు.

సీఎం కేసీఆర్ ఆఫీస్ నుంచే ప్రకటనలు రావటం వెనక ఉద్దేశం ఏంటని నిలదీశారు. రాష్ట్రానికి సీఎం అయ్యి ఉండి.. మత కలహాలు జరుగుతాయి.. అల్లర్లు జరుగుతాయి అని చెప్పటం చూస్తుంటే.. టీఆర్ఎస్ – ఎంఐఎం పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నట్లు అనుమానం ఉందన్నారు. శాంతిభద్రతల సమస్యను తెరపైకి తెచ్చి ఎన్నికలను తప్పించుకోవాలని చూస్తున్నారని.. ప్రభుత్వ యంత్రాంగం సైతం టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. ప్రత్యేకంగా అదనపు బలగాలను రప్పించాలని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ బలగాలతోనే శాంతి భద్రతలను కాపాడాలని గవర్నర్ ను కోరారు లక్ష్మణ్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు