తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు లేదు

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు లేదు

తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు
బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
150 డివిజన్లలో మా అభ్యర్థులనే నిలబెడతాం
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రకటించారు. అయితే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జనసేన పొత్తు ఏపీ వరకే పరిమితమని, తెలంగాణకు వర్తించదని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని… మొత్తం 150 డివిజన్లలో తమ అభ్యర్థులను నిలబెడతామని సంజయ్ స్పష్టం చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు