ఇది మా మిత్ర ధర్మం.. శివసేనకు గట్టి కౌంటర్ ఇచ్చిన బీజేపీ

ఇది మా మిత్ర ధర్మం.. శివసేనకు గట్టి కౌంటర్ ఇచ్చిన బీజేపీ

బీహార్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా వేడిని పుట్టించాయి. ప్రధాన టీవీ ఛానళ్ళు అన్ని ఏకపక్షంగా సర్వేలు చేసి తేజస్విని సీఎం అని తేల్చాయి. కొన్ని ఛానెలు తమ పైత్యాన్ని బయటపెట్టాయి. 160 స్థానాల్లో ఆర్జేడీ కూటమి విజయం సాదిస్తుందని తేల్చాయి. ఎన్నికల రోజు కూడా సీనియర్ జర్నలిస్టులుగా పేరుతెచ్చుకున్న కొందరు వారి విలువ తగ్గించుకొని తేజస్వి పాటపాడాయి.

అయితే ఎన్డీఏ కూటమి వీరి సర్వేలను పరిగలోకి తీసుకోలేదు, ఆలా అని తేజస్విని తక్కువగా అంచనా వెయ్యలేదు.. యువనాయకుడు గట్టి పోటీ ఇస్తాడని ముందుగానే తెలుసుకున్నారు ఎన్డీఏ నేతలు. ఇక వేరే వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్డీఏ కూటమికి నష్టం వాటిల్లుతుందని గమనించిన బీజేపీ నితీష్ నే ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.

బీహార్ లో ఓడిపోకూడదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆర్జేడీ, ఎన్డీఏ కూటములు రంగంలోకి దిగాయి.. అయితే ఫలితాలు మాత్రం తలకిందులయ్యాయి. ఇలా జరగడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఫలితాలను చూసిన తర్వాత చెప్పక తప్పదు. యువనాయకుడు తేజస్వి కష్టాన్ని కాంగ్రెస్ బూడిదలో పోసింది. నమ్మకంలో 70 స్థానాలు కేటాయిస్తే.. ముక్కి మూలిగి 19 సీట్లను తేజస్వి చేతిలో పెట్టింది.

ఆ 19 సీట్లతో తేజస్వి ఎం చేయగలుగుతారు. 33 ఏళ్ల తేజస్వి కల ఒక్కటే అతి చిన్న వయసులో సీఎం కావాలని కానీ ఆ కలను కాంగ్రెస్ కల్లలు చేసింది. యువనాయకుడిని సీఎం కాకుండా చేసింది. అయితే సర్వేల అంచనాల్లో కాంగ్రెస్ పార్టీని ఓ రేంజ్ లో తీసుకోవడమే వారు చేసిన పెద్ద పొరపాటు.

కాంగ్రెస్ తనకు ఇచ్చిన స్థానాల్లో 30 నుంచి 35 గెలిచినా తేజస్వి సీఎం అయ్యేవారు. అయితే ఇంత గోరంగా విఫమైతుంది అని, ఆ గొప్ప పేరున్న జర్నలిస్టులు కూడా అలోచించి ఉండరు. పసలేని పార్టీని పైకి లేపుదామని చూశారు కానీ.. ప్రజలు ఓట్లు వేశారా లేదా అనేది గమనించలేక పొయ్యారు.

ఇక సీఎం విషయానికి వస్తే తమకు ఎక్కువ సీట్లు వచ్చాయని బీజేపీ కొర్రీ పెట్టడం లేదు. సీఎం నితీష్ అని ప్రకటించింది. ప్రాణమ స్వీకారం దీపావళి రోజు లేదా దీపావళి తెల్లారి ఉంటుందని చెబుతుంది. తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఘంటాపదంగా బీజేపీ చెబుతుంది.

సీఎం అభ్యర్థిని ముందు పెట్టి తాము ఎన్నికలకు వెళ్లామని మిత్ర ధర్మాన్ని మరచి ప్రవర్తించమని బీజేపీ చెబుతుంది. అయితే నితీష్ కూడా బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. బీహార్ లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, జేడీయూకి సీఎం పదవి ఇచ్చి, మంత్రి పదవులు అధికంగా తీసుకుంటే అభ్యంతరం లేదని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే సీఎం, స్పీకర్ పదవులు జేడీయూకి ఇచ్చి, హోంమంత్రి, ఆర్ధికమంత్రి, విద్యాశాఖామంత్రి వంటి కీలక పదవులు బీజేపీ తీసుకోనున్నట్లు సమాచారం. అయితే బీహార్ లో అక్షరాస్యత చాలా తక్కుగావా ఉంటుంది. దీనిని పెంచాలని అంటే బీజేపీకి కత్తిమీద సామువంటిదే.. ఇక్కడ కూలిపని చేసి బ్రతికేవారు అధికంగా ఉంటారు.

వారి పిల్లలను చదివించుకోవడం కష్టం.. అటువంటి వారికోసం ఎన్డీఏ ప్రభుత్వం ఓ కొత్త పద్దతిని అవలంబించాల్సి ఉంటుంది.. అక్షరాస్యత పెంచడానికి అనువైన మార్గాలను వెతకాల్సి ఉంటుంది. వివిధ రాష్ట్రాలు, దేశాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చెయ్యాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ విద్యాశాఖ పదవి అనేది కత్తిమీద సమూలంగా ఉంటుంది. ఏది ఏమైనా సీఎంగా మరోసారి ప్రమాణం చేస్తున్న నితీష్, ఐదేళ్లు సుస్థిర ప్రభుత్వాన్ని నడిపేందుకు సిద్ధంగా ఉండాలి.

ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యాఖ్యలు శివసేనకు కౌంటర్ గా మారాయి. తాము ఎక్కువ గెలిచామని సీఎం సీటుకోసం ఆశపడలేదని బీజేపీ చేసిన వ్యాఖ్యలు శివసేన కుటిల బుద్దిని ప్రశ్నించించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు