పోటాపోటీగా భారత రత్న డిమాండ్ – ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో

పోటాపోటీగా భారత రత్న డిమాండ్ - ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో.. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న 4 వేల 600 ఎకరాల భూములను ఎవరు కబ్జా చేశారు అంటూ ప్రశ్నించారు అసదుద్దీన్.

bjp trs

భారతరత్న.. దేశంలో అత్యున్నత పురస్కారం ఇది.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఈ బిరుదు ఇవ్వాలని తెలంగాణ పార్టీలు పోటాపోటీగా డిమాండ్ చేస్తున్నారు.

హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చరా అని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది.. ప్రశ్నించింది. పాతబస్తీలోని పేదల ఇళ్లే కూల్చుతారా అని నిలదీసింది.

హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న 4 వేల 600 ఎకరాల భూములను ఎవరు కబ్జా చేశారు అంటూ ప్రశ్నించారు అసదుద్దీన్.

ఎంఐఎం వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. 26వ తేదీ ఉదయం ఎన్టీఆర్ సమాధిని సందర్శించి.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన ఎన్టీఆర్ కీర్తిని ప్రశంసిస్తూ.. ఆయనకు భారత రత్న బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ వెంటనే పీవీ నరసింహారావు సమాధిని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిన పీవీ, ఎన్టీఆర్ కు భారతరత్న బిరుదు ఇవ్వాలని కోరారు బండి సంజయ్.

బండి సంజయ్ వైఖరిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత స్పందించారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉందని.. అలాంటప్పుడు పీవీకి, ఎన్టీఆర్ కు భారత రత్న బిరుదు డిమాండ్ చేయటం ఏంటని ప్రశ్నించారు. కేంద్రంతో మాట్లాడి ప్రకటించాలి కదా సూటిగా అడిగారు.

టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్.. కాంగ్రెస్ పార్టీ నుంచి దేశ ప్రధాని అయిన పీవీ నరసింహారావులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు. ఆయా పార్టీలు అయిన కాంగ్రెస్, టీడీపీ మాత్రం ఈ రాజకీయంగా వెనకబడటం విశేషం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు