రండి బాబూ రండి.. కార్పొరేటర్లకు బీజేపీ వల

వాళ్లకు ఫోన్లు చేస్తుందంట.. కార్పొరేటర్ గా బరిలోకి దిగే వారికి ఢిల్లీ నుంచి మద్దతు ఉంటుందని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని..

గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దుబ్బాక రిజల్ట్ తర్వాత బీజేపీ మరింత దూకుడుగా ఉంది. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయటానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుంది. టైం ఎక్కువగా లేకపోవటంతో.. రాష్ట్ర నేతల నుంచి గల్లీ లీడర్ వరకు అందరూ జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిపెట్టారు. హైదరాబాద్ సిటీపై పట్టు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది బీజేపీ. ఈ క్రమంలోనే భారీ ఆఫర్స్ ప్రకటించింది.

ప్రస్తుతం బీజేపీకి సిటీలో కార్పొరేటర్లు లేరు. ఈ కొరత అధిగమించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని కీలక నేతలకు వల వేస్తోంది. రండి బాబూ రండి.. ఆలసించిన ఆశాబంగం.. మంచి తరుణం ఇదే అంటూ ఆహ్వానాలు పంపుతోంది. టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్లపై ఫోకస్ చేయటంతోపాటు.. కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్న నేతలకు వల వేస్తోంది.

సత్తా ఉందని నిరూపించుకుంటే ఎలాంటి ఆఫర్ ఇచ్చిన అయినా.. తీసుకోవటానికి సిద్ధంగా ఉంది. గెలుపే లక్ష్యంగా ఉండాలి.. రాజకీయంగా, ఆర్థిక, సామాజికంగా.. ప్రచారం పరంగా అంతా మద్దతు ఇస్తాం అని ప్రకటిస్తోంది. ద్వితీయ శ్రేణి నేతలకు సైతం ఆఫర్స్ ఇస్తోంది. దీని కోసం బీజేపీలోని ఓ టీం ప్రత్యేకంగా వర్క్ చేస్తోంది.

డివిజన్ల వారీగా నేతల లిస్ట్ ను వడబోసి.. వాళ్లకు ఫోన్లు చేస్తుందంట.. కార్పొరేటర్ గా బరిలోకి దిగే వారికి ఢిల్లీ నుంచి మద్దతు ఉంటుందని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. అన్ని రకాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేస్తుందంట. ఎంత మంది గులాబీ కాదని.. కాషాయ జెండా పట్టుకుంటారో చూడాలి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు