బీజేపీ మేనిఫెస్టో విడుదల : మైండ్ బ్లాంక్ అయ్యే హామీలు

బీజేపీ మేనిఫెస్టో విడుదల : మైండ్ బ్లాంక్ అయ్యే హామీలు.. గ్రేటర్ పరిధిలోని టూ వీలర్లు, ఆటోలపై ఇప్పటి వరకు ఉన్న చలాన్లు రద్దు ఇంటింటికీ నల్లా నీళ్లు.. 24 గంటలూ ఉచితంగా మంచినీళ్లు అందిస్తాం

BJP Ghmc Manifesto Release
BJP Manifesto

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మేనిఫెస్టోను విడుదల చేశారు మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత ఫడ్నవిస్. గురువారం పార్టీ కార్యాలయంలో ప్రజలకు విడుదల చేశారు.

బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు :

గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ గెలిస్తే LRS రద్దు చేస్తాం. ఇప్పటికే ఈ పథకం కింద టీఆర్ఎస్ ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలు దోచుకున్నది
వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక తీసుకొచ్చి అమలు చేయటం. వరద బాధితులకు 25 వేల రూపాయల ఆర్థిక సాయం.

గ్రేటర్ పరిధిలోని టూ వీలర్లు, ఆటోలపై ఇప్పటి వరకు ఉన్న చలాన్లు రద్దు
ఇంటింటికీ నల్లా నీళ్లు.. 24 గంటలూ ఉచితంగా మంచినీళ్లు అందిస్తాం
ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తి పన్ను మాఫీ, కుల వృత్తులకు ఉచిత విద్యుత్, పేదలు అందరికీ 100 యూనిట్లలోపు వాడుకుంటే ఉచితం.

మహిళల కోసం కిలోమీటర్ కు ఓ టాయ్ లెట్ ఏర్పాటు
మహిళల రక్షణ కోసం ఐదేళ్లలో హైదరాబాద్ సిటీలో 15 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు
గ్రేటర్ పరిధిలో చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు, ఫ్రీ వై-ఫై. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల నియంత్రణకు కమిటీ. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉచితం కోచింగ్
గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు మెట్రో, ఎంఎంటీఎస్ రైలు సేవలు విస్తరణ

125 గజాలలోపు ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేకుండా ఉత్తర్వులు జారీ చేస్తాం
లంచాలు లేని, అవినీతి రహితమైన పాలన అందించే విధంగా జీహెచ్ఎంసీని తీర్చిదిద్దటమే బీజేపీ లక్ష్యం.

బీజేపీ మేనిఫెస్టో చూసినోళ్లకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇవి అమలు చేస్తే మాత్రం సూపరో సూపర్ అంటున్నారు. మరి జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుస్తుంది అంటారా…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు