ఆంధ్రోళ్లు ఉన్న ఏరియాల్లో బీజేపీ ఎలా గెలిచింది..

ఆంధ్రోళ్లు ఉన్న ఏరియాల్లో బీజేపీ ఎలా గెలిచింది.. ఈసారి ఎన్నికలు ప్యూర్లీ తెలంగాణ ఓటర్లతో సాగాయి.. అంటే తెలంగాణ జనం టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని చూడటమే కాదు..

టీఆర్ఎస్ పార్టీ అనగానే సెంటిమెంట్.. ఉద్యమం.. మనకెందుకులే అనే ఫీలింగ్ ఉంటుంది ఆంధ్రోళ్లకు. ఏడేళ్లుగా ఏ ఎన్నిక జరిగినా ఆంధ్ర వాళ్లు ఉండే ఏరియాల్లో టీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ గా గెలుస్తూ వస్తుంది.. గతంలో టీడీపీకి ఉన్న వాళ్లు అందరూ గులాబీ కండువాలు కప్పుకోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవటంతో గంపగుత్తగా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడేవి. మరో పార్టీ ఆలోచన చేయలేదు.

2020, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఆంధ్రోళ్ల ఓట్లు ఎక్కువ అనే టాక్ ఉన్న డివిజన్లలో బీజేపీ గెలవటం అందరినీ షాకింగ్ కు గురి చేసింది. అమీర్ పేటలో బీజేపీ గెలిచిందా.. గచ్చిబౌలిలో టీఆర్ఎస్ ఓడిపోయిందా.. జూబ్లీహిల్స్ లో బీజేపీ ఎలా గెలిచింది.. మూసాపేటలో బీజేపీ విక్టరీ కొట్టటం.. మల్కాజిగిరిలో బీజేపీ విజయకేతనం ఎగురువేయటం ఏంటీ.. ఇలాంటి మాటలపై డిస్కషన్స్ జరిగాయి. గతంలో ఈ డివిజన్లలో అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.

ప్రస్తుత ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఆంధ్రోళ్లు అనే సెంటిమెంట్ అయిపోయింది.. పని చేయదు అని తేల్చేశారు ఓటర్లు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు దుకాణం సర్దేయటం.. ఇన్నాళ్లు ప్రతిపక్షం లేకపోవటంతో టీఆర్ఎస్ పార్టీ వైపు వన్ సైడ్ గా ఉన్నారు ఓటర్లు.

ఇప్పుడు బీజేపీ రూపంలో వారికి మరో పార్టీ దొరికింది.. అండ దొరికింది అనే ఫీలింగ్ లో ఉన్నారు సాధారణ ఓటర్లు. దీనికితోడు ఈసారి ఆంద్రోళ్ల ఓటర్లు పెద్దగా ఎవరూ లేరు ఈ ప్రాంతాల్లో.. వర్క్ ఫ్రం హోం వల్ల అందరూ సొంతూళ్లకు వెళ్లి పని చేసుకుంటున్నారు. దీని వల్ల ఓటు వేయలేకపోయారు.

ఈసారి ఎన్నికలు ప్యూర్లీ తెలంగాణ ఓటర్లతో సాగాయి.. అంటే తెలంగాణ జనం టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని చూడటమే కాదు.. గెలిపించటం విశేషం.. ఇది చాలా పెద్ద మార్పు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు