జమిలి ఎన్నికలపై బీజేపీ క్లారిటీ ఇచ్చిందా – అందుకేనా 50 వేల ఉద్యోగాల భర్తీ

సంకేతాలు బీజేపీ హైకమాండ్ నుంచి స్పష్టంగా వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు. 2022 మార్చిలోనే దేశంలోని అన్ని పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు..

Bjp hint to kcr jamili elections in 2022
Bjp hint to kcr jamili elections in 2022

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతోపాటు హోంమంత్రి అమిత్ షాలతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం కేసీఆర్.. ఆదివారం హైదరాబాద్ వచ్చీ రాగానే ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రొటీన్ అనుకోవటానికి లేకుండా బిగ్ బ్రేకింగ్ ఇచ్చారు. ఒకేసారి 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు.

టీచర్, పోలీస్ శాఖల్లో అన్ని ఖాళీల భర్తీతోపాటు ఇతర శాఖల్లోని ఖాళీలను వీలైనంత త్వరగా తేల్చి.. వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి.. ఏడాదిలోపు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూడాలని గట్టిగా చెప్పారు సీఎం కేసీఆర్.

ఏడేళ్ల తర్వాత సీఎం కేసీఆర్ ఈ స్థాయిలో నోటిఫికేషన్ వేయాలని ఆదేశించటం.. అది కూడా ఢిల్లీలో మోడీ, అమిత్ షాలతో సుదీర్ఘ మంతనాల తర్వాత నిర్ణయం తీసుకోవటం అంటే.. జమిలి ఎన్నికలు రాబోతున్నాయా అనే డౌట్ అందరికీ వస్తోంది. మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అయ్యింది.

విజయం ఖాయం అనుకున్న టైంలో జనం తిరగబడ్డారు.. అర్బన్ అయినా.. రూరల్ అయినా టీఆర్ఎస్ వ్యతిరేక గాలి వీస్తుంది అని స్పష్టం అయ్యింది. డ్యామేజ్ కంట్రోల్ కోసం రైతు ఉద్యమం ఎత్తుకుని.. బీజేపీపైనే పోరాటంతో బంద్ నిర్వహించారు. ఆ తర్వాత సడెన్ గా ఢిల్లీ టూర్. ఆ తర్వాత నోటిఫికేషన్.

2022లో జమిలి ఎన్నికలు రాబోన్నాయని సంకేతాలు బీజేపీ హైకమాండ్ నుంచి స్పష్టంగా వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు. 2022 మార్చిలోనే దేశంలోని అన్ని పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్లు సీఎం కేసీఆర్ కు హింట్ ఇచ్చారనే.. అందుకే ఆదివారం అయినా సరే ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసి నిరుద్యోగులపై చర్చించినట్లు మిగతా పార్టీలు అంటున్నాయి.
నిప్పులేనిదే పొగ వస్తదా ఏంటీ.. హింట్ ఇవ్వకుండానే 50 వేల ఉద్యోగాల భర్తీని ఒకేసారి చేస్తారా ఏంటీ సీఎం కేసీఆర్ గారు.. సంథింగ్.. సంథింగ్..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు