2 రోజుల్లో మాట మార్చిన పవన్ : బీజేపీకే మద్దతు అని ప్రకటన వెనక కారణాలు ఏంటీ

అబ్బే అదేం లేదు అన్నారు.. రెండు రోజులు తిరక్కుండానే మళ్లీ అదే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

అనుకున్నట్లే జరిగింది. ముందుగానే షుగర్లీ చెప్పింది ఏంటంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ఇస్తుంది అని. అయితే పవన్ కల్యాణ్ మాత్రం హైదరాబాద్ లో పోటీ చేస్తాం అని ప్రకటించారు. చివరి ఏమైందీ.. నవంబర్ 20వ తేదీ నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి.. పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. బీజేపీకే మా మద్దతు అని. జనసేన కార్యకర్తలు, అభిమానులు వేసే ప్రతి ఒక్క ఓటు బీజేపీకి వేయాలని ప్రకటించారు.

నవంబర్ 17వ తేదీ జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు.. పోటీ చేస్తాం అని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. నామినేషన్లకు మూడు రోజులే గడువు ఉన్నా.. ఒక్క లిస్ట్ కూడా బయటకు రాలేదు. అన్ని పార్టీలు పోటీపడి మరీ అభ్యర్థులను ప్రకటిస్తే.. పోటీ చేస్తాం అన్న పవన్ కల్యాణ్ పార్టీ జనసేన నుంచి ఒక్క అభ్యర్థి లిస్ట్ రాలేదు. దీంతో పోటీపై అప్పుడే అనుమానాలు వచ్చాయి.

అనుకున్నట్లుగానే నవంబర్ 20వ తేదీ ఉదయం కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇద్దరూ కలిసి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. వీరు ఏం చర్చిచారో తెలియదు కానీ.. బయటకు వచ్చిన తర్వాత బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు పవన్ కల్యాణ్.

బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటిస్తాం అని ఏడాది క్రితమే ఘనంగా.. ఎవరూ అడక్కుండానే చెప్పిన పవన్ కల్యాణ్.. ప్రతి ఎన్నికలకు ముందు ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికీ అంతుచిక్కటం లేదు. జీహెచ్ఎంసీ షెడ్యూల్ వచ్చిన వెంటనే.. బీజేపీ – జనసేన పార్టీ పొత్తుతో బరిలోకి దిగుతాయి.. మద్దతు ఉంటుందని అందరూ అనుకున్నారు. అబ్బే అదేం లేదు అన్నారు.. రెండు రోజులు తిరక్కుండానే మళ్లీ అదే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

ఏంటో పవన్ కల్యాణ్ రాజకీయం ఎవరిరీ అర్థం కావటం లేదు. ఎవరికీ అంతుచిక్కన, ఊహకు అందని నిర్ణయాలతో అందరికీ షాక్ ఇస్తున్నారు. ఏదైతే ఏం బీజేపీకి మళ్లీ మద్దతు ప్రకటిస్తున్న ప్రకటించి.. తన మార్క్ పాలిటిక్స్ చూపించుకున్నారు పవర్ స్టార్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు