రాజాసింగ్ నే కాదంటారా – ఈ బీజేపీకి ఏమైందీ – కుట్ర జరుగుతుందా పార్టీలోనే

రాజాసింగ్ వద్దన్న వారికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ టికెట్లు ఇస్తున్నారు అంటే పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా

రాజాసింగ్.. గోషామహల్ ఎమ్మెల్యే.. తెలంగాణ రాష్ట్రం నుంచి మొన్నటి వరకు గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు.. కరుడుగట్టిన బీజేపీ వాదిగానే కాకుండా హిందుత్వ ఎజెండాను గట్టిగా భుజానికెత్తుకున్న లీడర్. గోషామహల్ రాజాసింగ్ అంటే తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పలుకుబడి ఉన్న బీజేపీ నేత.

అలాంటి ఆయన సొంత నియోజకవర్గంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తుగులుతుందా.. ఆయన మాటకే విలువ ఇవ్వటం లేదా అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పష్టం అవుతుంది. డివిజన్లకు కార్పొరేటర్లను ఎంపిక చేసే విషయంలో బీజేపీ హైకమాండ్ లోని కొన్ని శక్తులు ఆయన మాటను వ్యతిరేకించటం ఇప్పుడు సంచలనంగా మారింది. గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలను సమర్థవంతంగా, శక్తివంతంగా ఎదుర్కోగలిగిన ఎమ్మెల్యే రాజాసింగ్ చెబితేనే బీజేపీ బీ-ఫాం ఇవ్వకపోవటం ఏంటీ అనేది బీజేపీలో చర్చనీయాంశం అయ్యింది.

గోషామహల్, గన్ ఫౌండ్రీ, బేగంబజార్ డివిజన్లలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పినవారికి కాకుండా ఇతరులకు టికెట్లు కేటాయిస్తున్నారనే ప్రచారంతో రచ్చ మొదలైంది. ఈ మూడు డివిజన్లలో అభ్యర్థులను కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మరొకరికి ఇస్తున్నారని.. రాజాసింగ్ ను కాదని.. ఆయన వ్యతిరేకించిన వారికి బీ-ఫాం ఇస్తున్నారనేది చర్చనీయాం`శం అయ్యింది.

రాజాసింగ్ వద్దన్న వారికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ టికెట్లు ఇస్తున్నారు అంటే పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందా లేక వాళ్లిద్దరూ ఏమైనా మరో ప్లాన్ లో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజాసింగ్ ను కాదని ముందుకు వెళ్లటం అంటే బీజేపీకి ఏమైందీ అనే వాదన ఉంది. ఇలా అయితే చెట్టుపై ఉండి కొమ్మను నరుక్కున్నట్లే బీజేపీ..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు