అచ్చెన్నాయుడికి వల వేస్తున్న బీజేపీ.. అందివచ్చిన అవకాశంపై వ్యూహాత్మక ఎత్తుగడ

అచ్చెన్నాయుడికి వల వేస్తున్న బీజేపీ.. అందివచ్చిన అవకాశంపై వ్యూహాత్మక ఎత్తుగడ

bjp offer to atchannaidu
bjp offer to atchannaidu

అచ్చెన్నాయుడికి వల వేస్తున్న బీజేపీ.. అందివచ్చిన అవకాశంపై వ్యూహాత్మక ఎత్తుగడ

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఎలా ఉంది అనటానికి లీక్ అయిన అచ్చెన్నాయుడి వీడియోనే సాక్ష్యం.. ఇది ఒక్కటే కాదు.. ఇప్పటికే రాజ్యసభలో బీజేపీలో విలీనం అయితే.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయ్యింది టీడీపీ. ఇక మిగిలింది ఏపీ ఒక్కటి మాత్రమే.

ఏపీలో టీడీపీ సిట్యువేషన్ ఏంటీ అంటే.. ఎన్నికల గుర్తు లేని పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు అని ప్రచారం చేసుకున్నా.. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి 27 శాతం ఓట్లతో.. దారుణ ఓటమిని ఎదుర్కొంది టీడీపీ. వీటికి కొనసాగింపుగా వచ్చిన తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ ప్రచారం ఎల్లో మీడియాలో జోరుగా కనిపిస్తున్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని.. అచ్చెన్నాయుడు మాటలతో స్పష్టం అయ్యింది. 17వ తేదీతో ఫ్రీ అయిపోతాం.. ఆ తర్వాత పార్టీ లేదు.. బొక్కా లేదు.. పార్టీలో గౌరవం లేదు.. అధినేత చక్కగా ఉంటే ఈ దుస్థితి ఎందుకూ అంటూ నిర్వేదపు మాటలు.. ఇప్పుడు టీడీపీలో కంటే బీజేపీలో జోష్ తెచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది.. ఆలోపు బీజేపీని స్ట్రాంగ్ చేయాలంటే.. స్ట్రాంగ్ లీడర్ కావాలి.. ఇప్పుడు 30 ఏళ్ల అనుభవం ఉన్న.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి వల వేయాలని డిసైడ్ అయ్యింది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్నాడని డిసైడ్ అయిపోయింది.. టీడీపీకి ఇక భవిష్యత్ లేదని కూడా అతని మాటలతో తేలిపోయింది.. ఆ పార్టీలో లాభం లేదు అనుకున్నప్పుడు.. అచ్చెన్నాయుడికి మిగిలింది ఒకటే ఆప్షన్.. అదే బీజేపీ.. దీన్ని ముందుగానే పసిగట్టిన కమలదళం.. అచ్చెన్నాయుడి కాంటాక్ట్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

అచ్చెన్నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు. అలాంటి వ్యక్తిని బీజేపీలోకి తీసుకొస్తే.. పార్టీ నిర్మాణానికి.. బలోపేతానికి మంచి స్కోప్ ఉంటుందని భావిస్తుంది బీజేపీ హైకమాండ్. ఇందుకు తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది. ఏప్రిల్ 17వ తేదీ తర్వాత ఏ క్షణమైనా.. అచ్చెన్నాయుడితో చర్చలు జరిపే అవకాశం ఉందని ఏపీ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.

17 తర్వాత పార్టీ లేదు.. బొక్కా లేదు అని క్లారిటీతో ఉన్న అచ్చెన్నాయుడు ఇంకా ఆ పార్టీనే నమ్ముకుని ఉంటారా ఏంటీ.. బీజేపీ వల వేయటానికి ఇంత కంటే పాయింట్ ఉంటుందా ఏంటీ.. రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరూ ఊహించలేరు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు