బీజేపీ గెలిస్తే LRS రద్దు : బండి సంజయ్ సంచలన ప్రకటన

హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల సంగ్రామంలో.. బీజేపీ దూకుడుగా ఉంది. షెడ్యూల్ అలా వచ్చిందో లేదో ఇలా హామీల వర్షం కురిపిస్తోంది. మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో తెలియకపోయినా.. అంతముందే అద్భుతమైన హామీతో సంచలన ప్రకటన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం.. LRSను రద్దు చేస్తామని ప్రకటించి టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లో 3 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. కరోనా టైంలో.. ఉపాధి, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీ ఎంతో ఊరట కలిగించనుంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి సంతకం దీనిపైనే చేస్తాం అని చెబుతోంది బీజేపీ పార్టీ. మొదటి నుంచి ఎల్ఆర్ఎస్ స్కీంను వ్యతిరేకిస్తున్నాం అని.. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం అని చెబుతున్నాం అని.. అదే హామీని ఇస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళతాం అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందని.. గెలిచి తీరతాం అని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ.

గెలుపోటములు ఎలా ఉన్నా.. LRS రద్దు అనే బీజేపీ హామీ మాత్రం బాగా వర్కవుట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే 3 లక్షల మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు.. ఈ 3 లక్షల మందితోపాటు వారి కుటుంబాలు అన్నీ బీజేపీకి అనుకూలంగా మారితే కనీసం 10 లక్షల ఓట్లు గంపగుత్తుగా కాషాయం పరం కానున్నాయి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు