రెండో అతి పెద్ద పార్టీగా బీజేపీ – మూడో స్థానంలో ఎంఐఎం

రెండో అతి పెద్ద పార్టీగా బీజేపీ - మూడో స్థానంలో ఎంఐఎం.. గ్రేటర్ లో పాగా వేస్తాం అంటూ ధీమా వ్యక్తం చేసిన బీజేపీ.. ఆ స్థాయిలో కాకపోయినా.. 400 శాతం అధిక సీట్లు రాబట్టుకోవటం చూస్తుంటే.. తెలంగాణలో

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా మారుతున్నాయి. అనుకున్నదాని కంటే ఎక్కువగానే బీజేపీ సీట్లు సాధించింది. మరో విశేషం ఏంటంటే.. పదేళ్లుగా నాలుగో స్థానంలో ఉన్న బీజేపీ ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా రెండో స్థానంలోకి వచ్చింది.

మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఎంఐఎం కంటే ఎక్కువ సీట్లు సాధించి.. జీహెచ్ఎంసీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

150 డివిజన్లలో బీజేపీ 45 స్థానాలు గెలుచుకోగా.. టీఆర్ఎస్ పార్టీ 59 సీట్లకే పరిమితం అయ్యింది. ఎంఐఎం పార్టీ 42 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. గత ఎన్నికల్లో 4 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ.. ఈసారి 45 స్థానాల్లో గెలుపొందటం అంటే.. ఏకంగా 41 సీట్లను కొత్తగా గెలుచుకున్నది.

టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అన్నకున్న డివిజన్లలో సైతం.. బీజేపీ గెలిచి షాక్ ఇచ్చింది. 45 సీట్లు గెలవటమే కాకుండా.. మరో 10 డివిజన్లలో అతి తక్కువ ఓట్ల ఓడిపోయింది. హోరాహోరీ పోటీ ఇచ్చింది. ఇది టీఆర్ఎస్ పార్టీకి జీర్ణించుకోలేని విషయం. గ్రేటర్ లో పాగా వేస్తాం అంటూ ధీమా వ్యక్తం చేసిన బీజేపీ.. ఆ స్థాయిలో కాకపోయినా.. 400 శాతం అధిక సీట్లు రాబట్టుకోవటం చూస్తుంటే.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ పార్టీనే అని కన్ఫామ్ అయిపోయింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు