దుబ్బాకలో బీజేపీదే విజయం.. మెజారిటీ ఎంత వస్తుంది అంటే

దుబ్బాకలో బీజేపీదే విజయం.. మెజారిటీ ఎంత వస్తుంది అంటే

తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. మూడు ప్రధాన పార్టీలపైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు విజయం తమదంటే తమదని చెప్పుకుంటున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్, బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. కాంగ్రెస్ కూడా పెద్ద మొత్తంలో ఓట్లు సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.

ఇక ఎగ్జిట్ పోల్స్ చెయ్యడంలో మంచి పేరుకున్న మిషన్ చాణక్య దుబ్బాక బీజేపీనే గెలుస్తుంది అని తేల్చేసింది. ప్రతి 13 మంది ఓటర్లలో ఒకరిని కలిసిన మిషన్ చాణక్య టీం సభ్యులు వారి ఆలోచనలను సేకరించారు. అక్టోబర్ 3 నుంచి దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించింది ఈ టీం.. ఇక వీరి సర్వేలో బీజేపీకి 47.88 శాతం ఓట్లు పడినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కు 40.90 శాతం వచ్చినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ కు 11.16 శాతం ఓట్లు వస్తాయని తెలిపారు.

ఇక మరికొన్ని సర్వే సంస్థలు చేసిన సర్వేలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అన్నట్లు తెలిపారు. కాగా చాణిక్య సర్వే చాలా నమ్మకమైనది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 86 స్థానాలలో విజయం సాదిస్తుందని తెలిపారు. అన్నట్లుగానే ఒక నాలుగు స్థానాలు ఎక్కువే సాధించింది. అనంతరం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 140 స్థానాలకు పైనే కైవసం చేసుకుంటుందని వెల్లడించారు.

వీరు చెప్పినట్లుగానే 151 స్థానాలను కైవసం చేసుకోండి వైసీపీ. ఇక ఇప్పడు బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో జరిగిన ఉపఎన్నికల సర్వేలు కూడా నిర్వహించారు. అక్కడ అధికార పార్టీలదే హావ అని తేల్చారు. ఇక బీహార్ లో మాత్రం సీఎం పీఠం దోబూచులాటగా ఉంటుందని వివరించారు. ఇక 6 వేల నుంచి 9 వేల మధ్య మెజారిటీ వస్తుందని మిషన్ చాణిక్య తెలిపింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు