వాటేసుకోవచ్చు.. చిందులేయొచ్చు.. గంతులేయొచ్చు.. పండగ చేసుకోవచ్చు.. అందుకే ఆ దేశాన్ని గ్రేట్ అన్నారు..

britain over corona vaccine

ఈ టైటిల్ చూస్తే కిరాక్ కిక్కు ఎక్కిస్తుంది కదా.. ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా అనే ఫీలింగ్ వస్తుంది కదా.. ఏం చేస్తాం.. మీ టైటిల్ లోని ఏ ఒక్కటీ ఇప్పుడు భారతదేశంలో చేసే పరిస్థితి లేదు.. ఎందుకంటే కరోనా భయం.. ప్రపంచలోని ఒకే ఒక్క దేశంలో ఇవన్నీ చేసుకోండి అంటూ కరోనా ఆంక్షలు తొలగించింది.. ఆ దేశం ఏదో తెలుసా.. ఇంగ్లాండ్.. గ్రేట్ బ్రిటన్..

అవును.. 2020 సెప్టెంబర్ లో అత్యంత పీక్ స్టేజ్ కరోనాలోకి వెళ్లిన ఇంగ్లాండ్ దేశం.. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ ప్రక్రియ వేయటం ప్రారంభించింది. వ్యాక్సిన్ ప్రక్రియపై ప్రపంచంలోని 226 దేశాల్లో ముందుగా మేల్కొన్నది ఒకే ఒక్క దేశం.. అదే బ్రిటన్.. యునైటెట్ కింగ్ డమ్. 2020 మేలో ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ 9 కోట్లు ఆర్డర్ చేసింది. 2020 జూలైలో మూడు కోట్ల ఫైజర్ వ్యాక్సిన్ ఆర్డర్ చేసింది.. 2020 ఆగస్ట్ లో 3 కోట్ల జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ డోసులు ఆర్డర్ చేసింది. ఈ మూడు కంపెనీలే కాకుండా కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించి మరో 6 కోట్ల డోసులు ఆర్డర్ ఇచ్చింది బ్రిటన్.

కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ కావటం.. అదే సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం.. ముందుగా ఆర్డర్ ఇచ్చినట్లే బ్రిటన్ కు ఆయా కంపెనీలు వ్యాక్సిన్ ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టింది. వ్యాక్సిన్ వేయించుకుంటే ఆఫర్స్ ప్రకటించింది. జనం ఎగబడి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రభుత్వం సైతం అందుకు తగ్గట్టుగా వ్యాక్సిన్ నిల్వలు చేసి పెట్టింది. ఇప్పుడు బ్రిటన్ లో వ్యాక్సిన్ ఎంత శాతం వేశారో తెలుసా.. 68 శాతం మందికి. రెండు డోసులు తీసుకున్న వారు 34 శాతం. దాదాపు పెద్దలు అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు.

బ్రిటన్ లో వ్యాక్సిన్ తీసుకోవాల్సింది ఇక పిల్లలే. 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదిన చేసిన బ్రిటన్ దేశంలో ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 15 వందలుగానే ఉంది. పెద్దలు అందరికీ వ్యాక్సిన్ వేసేయటం.. కేసులు సంఖ్య భారీగా తగ్గటంతో కరోనా ఆంక్షలు సడలించింది బ్రిటన్ ప్రభుత్వం.

ఇంట్లో హగ్ చేసుకోవచ్చు అదేనండీ వాటేసుకోవచ్చు.. పార్టీలు చేసుకోవచ్చు.. పెళ్లిళ్లు చేసుకోవచ్చు.. చిందులేయొచ్చు.. గంతులేయొచ్చు అని ప్రకటించింది.

వ్యాక్సిన్ పై దూరదృష్టి ఉంటే.. ఆ దేశం ఎంత సేఫ్ గా ఉంటుందో బ్రిటన్ చేసి చూపించింది. అందుకే అన్నారు గ్రేట్ బ్రిటన్ అని.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు