ఏపీ – తెలంగాణ మధ్య బస్సులు నడుస్తాయి-ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

travel buses will move in between hyderabad and ap

తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అనగానే అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలు డైలామాలో పడ్డారు. ఎందుకంటే.. ఏపీ నుంచి తెలంగాణకు ప్రతిరోజూ లక్షల మంది వచ్చి పోతుంటారు. వీళ్లందరూ ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో వచ్చేవారు కొందరు అయితే.. మరికొందరు ప్రైవేట్ వాహనాల్లో రవాణా చేస్తూ ఉంటారు.

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ క్రమంలో.. బస్సులు నడుస్తాయా లేదా అనేది డౌట్ అందరిలో ఉంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, రైళ్లు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. అంతర్ రాష్ట్ర సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించింది.

ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించేవారు వారి టికెట్ చూపిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ప్రయాణికులపై ఎలాంటి ఆంక్షలు లేవని.. వారికి పూర్తిగా పోలీస్ శాఖ సహకరిస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. అదే విధంగా ఇంటర్నెట్, కేబుల్, టెలి కమ్యూనికేషన్ సేవలకు సైతం మినహాయింపు ఇచ్చింది.

సో.. ఏపీ ప్రజలు డోంట్ వర్రీ.. మీ దగ్గర టికెట్ ఉంటే హ్యాపీగా జర్నీ చేయవచ్చు. ఎవరూ ఎలాంటి ఇబ్బంది పెట్టరు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు