బెయిల్ రద్దు పిటీషన్ పై మీరేమంటారు : సీఎం జగన్ కు నోటీసులు ఇచ్చిన సీబీఐ కోర్టు

cm jagan tirupati tour cancel

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కోరుతూ.. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్ పై.. మే 7వ తేదీ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు విచారణ చేసింది. పిటీషన్ లోని అంశాలపై మీ సమాధానం ఏంటీ.. మీరు ఏం చెప్పదలచుకున్నారో చెప్పండి అంటూ సీఎం జగన్ కు నోటీసులు పంపింది సీబీఐ కోర్టు.

పిటీషన్ లోని అంశాలపై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని సీఎం జగన్ తరపు న్యాయవాది కోరగా.. అందుకు అంగీకరించిన కోర్టు.. విచారణకు మే 17వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

జగన్ పై రాజకీయంతోపాటు వ్యక్తిగత కక్షతో ముందుకు దూసుకెళుతున్నారు రఘురామకృష్ణంరాజు. రోజూ ఓ వర్గం మీడియాలో తన అభిప్రాయాలను.. తన అక్కసును ఆరు నెలలుగా వెళ్లగక్కుతూ ఉండటం చూస్తూనే ఉన్నారు జనం. బ్యాంకులకు దాదాపు 3 వేల కోట్ల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టిన వ్యవహారంలో సీబీఐ కేసులు నమోదు చేయటం.. విచారణ చేపట్టిన తర్వాత నుంచి జగన్ పై.. ఏపీ ప్రభుత్వంపై మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ వేయటంతోపాటు.. రద్దు అవుతుంది.. మళ్లీ జైలుకు వెళ్లటం ఖాయం అంటున్నాడు ఈ తిరుగుబాటు ఎంపీ.

బెయిల్ రద్దు చేయాలని.. విచారణకు సహకరించటం లేదని విచారణ సంస్థలు అయిన సీబీఐ, ఈడీ సంస్థలు సైతం డిమాండ్ చేయలేదు.. అలాంటిది రఘురామకృష్ణంరాజు పదేపదే పిటీషన్లు వేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. సమాధానం చెప్పాలని సీఎం జగన్ కు నోటీసులు పంపించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు