ఏంటీ అచ్చెన్నా.. ఏం జరుగుతుంది.. ఏంటా వీడియో.. తిరుపతిలో చంద్రబాబు అసహనం

ఏంటీ అచ్చెన్నా.. ఏం జరుగుతుంది.. ఏంటా వీడియో.. తిరుపతిలో చంద్రబాబు అసహనం

chandra babu and Atchennaidu meeting on leaked video
chandra babu and Atchennaidu meeting on leaked video

ఏంటీ అచ్చెన్నా.. ఏం జరుగుతుంది.. ఏంటా వీడియో.. తిరుపతిలో చంద్రబాబు అసహనం

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఏప్రిల్ 13వ తేదీ.. తిరుపతిలోని పార్టీ ఆఫీసులో భేటీ అయ్యారు. అచ్చెన్నాయుడుతో.. అదృశ్య వ్యక్తి మాట్లాడిన మాటలను వీడియో లీక్ కావటం.. సోషల్ మీడియాలో వైరల్ కావటం.. 17వ తేదీ ఎన్నిక తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు అంటూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.

ఈ వీడియో లీక్ అయిన తర్వాత.. ఏప్రిల్ 13వ తేదీ మంగళవారం తిరుపతిలోని పార్టీ ఆఫీసులో ఉగాది వేడుకల్లో వీళ్లద్దరూ కలుసుకున్నారు. కలిసే పూజలు చేశారు. అనంతరం.. చంద్రబాబు – అచ్చెన్నాయుడుతోపాటు జిల్లాకు చెందిన మరో ముగ్గురు నేతలతో గంటపాటు చర్చించారు చంద్రబాబు.

ఈ సమయంలో వీడియో ప్రస్తావన వచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది.. మాట్లాడింది ఎవరు అనే వివరాలను అచ్చెన్నాయుడు నుంచి తెలుసుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత సున్నితంగా హెచ్చరించారంట. పార్టీ వ్యవహారాలపై మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలని.. ముందూ వెనకా చూసుకోవాలని సూచించారంట.

తిరుపతిలో పార్టీ గెలుపు కోసం ఎంత కష్టపడుతున్నామో చూస్తున్నారు కదా.. మీరు కూడా నెల రోజులుగా ఇక్కడే ఉన్నారు.. పోలింగ్ జరగబోయే సమయంలో ఇలాంటి వీడియో బయటకు వచ్చింది అంటే ఎంత డామేజ్ అవుతుందో అర్థం మీకు తెలియంది కాదు అంటూ మందలించారంట.

వెంకట్రావు మన అందరికీ తెలిసిన వ్యక్తి.. నందమూరి కుటుంబానికి నా కంటే ముందే పరిచయం.. అతను ఇలా చేస్తాడనుకోలేదు.. మన పార్టీ కార్యకర్త, నేత, నందమూరి, నారా కుటుంబాలకు సన్నిహితుడు.. ఇలా చేస్తాడనుకోలేదని వివరించారంట అచ్చెన్నాయుడు. నాలుగు గోడల మధ్య.. కొన్ని సార్లు ఆవేశంలోనో.. ఆవేదనలోనో కొన్ని మాటలు బయటకు వస్తుంటాయని.. వాటిని మనసులో పెట్టుకుంటే ఎలా అంటూ అచ్చెన్నాయుడు తన వివరణ ఇచ్చారంట. నా మాటలు కాదు అని అచ్చెన్నాయుడు అనలేదంట.

గతంలో చాలాసార్లు వెంకట్రావు ఈ సమస్యపై నాతో మాట్లాడాడు.. పదేపదే వస్తూనే ఉన్నారు. ఇప్పుడు తిరుపతిలో ఉన్నా హోటల్ కు వచ్చి మరీ ఏదో ఒకటి చేయమని ఒత్తిడి చేస్తున్నాడు.. నేను గతంలోనే చెప్పాను.. పెద్దాయన దగ్గరకు వెళ్లు అని.. అక్కడ కాకపోతే లోకేష్ దగ్గరకు వెళ్లమని చెప్పాను.. మీ ఇద్దరి దగ్గర పని కాకపోయే సరికి.. మళ్లీ నా దగ్గరకు వచ్చాడు. అందరూ తిరుపతిలోనే ఉన్నారు కదా.. ఏ మాట చెప్పమని వచ్చాడు.. ఈ సమయంలో ఏదో అలా జరిగిపోయింది.. పార్టీ నాశనం అవుతుందన్న బాధ తప్పితే వ్యక్తిగత కోపం ఏమీ లేదు అంటూ వివరణ ఇచ్చారంట అచ్చెన్నాయుడు.

ఏప్రిల్ 17 తిరుపతి పోలింగ్ తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు అంటే ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యల వీడియో.. ఇప్పుడు టీడీపీని కుదిపేస్తోంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు