తమిళనాడును చూసి నేర్చుకోండి తమ్ముళ్లు.. పోరాటం అంటే అలా ఉండాలి..

తమిళనాడును చూసి నేర్చుకోండి తమ్ముళ్లు.. పోరాటం అంటే అలా ఉండాలి..

babu and jayalalitha
babu and jayalalitha

తమిళనాడును చూసి నేర్చుకోండి తమ్ముళ్లు.. పోరాటం అంటే అలా ఉండాలి..

పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల కంటే.. ఇప్పడు తమిళనాడు రిజల్ట్స్ ఏపీ, తెలంగాణ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీలకు అందని విధంగా.. జయలలిత స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ సాధించిన సీట్లు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇది ఎలా సాధ్యం అయ్యింది అనేది అందరిలో ఆసక్తి రేపుతున్నాయి.

జయలలిత మరణం తర్వాత శశికళ జైలుకు వెళ్లిన తర్వాత.. అన్నాడీఎంకే పార్టీ నుంచి పళనిస్వామి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లు పూర్తిగా అధికారంలో ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, శశికళ లేకుండానే ఎన్నికలకు వెళ్లారు. అన్నాడీఎంకే పార్టీని అన్నీ తానై నడిపించారు సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం. ఈ క్రమంలోనే.. అన్ని ఎగ్జిట్ పోల్స్, పత్రికలు, న్యూస్ ఛానళ్ల సర్వేలు అన్నాడీఎంకే పార్టీ ఓడిపోతుందని చెప్పారు. ఓడిపోవటం ఖాయం అయినా.. అన్నాడీఎంకే పార్టీకి అత్యధికంగా 58 సీట్లకు మించి రావని వందకు 100 శాతం సర్వేలు చెప్పాయి.

ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. అన్నాడీఎంకే పార్టీ ఊహించని విధంగా 80 సీట్లకు పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్ సర్వేలకు భిన్నంగా 100 శాతం అధికంగా సీట్లు సాధించింది. హీనపక్షం 28 సీట్లు వస్తాయని.. మరో అద్భుతం జరిగితే 58 సీట్లు వస్తాయని అందరూ అంచనా వేశారు. వాస్తవం ఏంటంటే.. అన్నాడీఎంకే పార్టీ 80 సీట్లకు పైగా సాధించింది.

దీన్నిబట్టి అర్థం అయ్యింది ఏంటంటే.. లీడర్ అనే వారు ముఖ్యం కాదు.. ఆ పార్టీ చేసే మంచి పనులే ముఖ్యం అని తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు ఎలాంటి చరిష్మా లేకపోయినా.. రాజకీయ వ్యూహాలు పన్నే వ్యక్తులు కాకపోయినా.. మూడేళ్లలో ప్రజలకు చేసిన మంచి పనులే ఇవాళ అన్నాడీఎంకే పార్టీని నిలబెట్టాయి.

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ గెలవొచ్చు.. స్టాలిన్ సీఎం కావొచ్చు.. అన్నాడీఎంకే పార్టీ అయితే తన ఉనికి చాటుకుంది. 80కి పైగా సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 234 సీట్లలో.. 80 సీట్లు సాధించింది అంటే మాటలు కాదు.. ఈ అంశమే ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా పొగడ్తలు, భజనలు మానేసి పార్టీ కోసం పని చేస్తే భవిష్యత్ ఉంటుందని తమిళనాడు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.

175 సీట్లలో 23 సీట్లు మాత్రమే సాధించిన టీడీపీ ఎక్కడ.. జయలలిత లేని అన్నాడీఎంకే పార్టీ 234 సీట్లలో 80 సీట్లు సాధించటం ఎక్కడ.. లోపం ఎక్కడ ఉంది.. అధినేత లేని పార్టీని ప్రధాన ప్రతిపక్షంలో నిలిపిన లీడర్స్ కావాలో.. అధినేతకు భజన చేస్తూ నేతలు వద్దనుకునే టీడీపీ పార్టీకి ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించండి..

ఇది మంచికి చెబుతున్న మాట.. టీడీపీ అభిమాని మాట.. అర్థం చేసుకుంటే బాగుపడతారు.. అర్థం కాకపోతే వాళ్లు టీడీపీ వాళ్లే కాదు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు