బాబుగారూ ఏంటీ ఆవేశం.. కేకలతో వెళ్లి కొడతారా అన్నంతగా చంద్రబాబు

బాబుగారూ ఏంటీ ఆవేశం.. కేకలతో వెళ్లి కొడతారా అన్నంతగా చంద్రబాబు.. బాబుగారూ ఏంటీ ఆవేశం అంటున్నారు అభిమానులు.. అసలే వయస్సు 70 దాటింది.. ఇంత ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదు అని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నారు.

ఏపీ అసెంబ్లీ ఇప్పటి వరకు చూడని చంద్రబాబును ఫస్ట్ టైం చూశారు ఏపీ జనం. వీరావేశంతో ఊగిపోయారు. ఆగ్రహం కట్టలు తెంచుకుని పెద్ద పెద్ద కేకలు వేశారు. చేతులతో వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ వాళ్లను వెళ్లి కొడతారా ఏంటీ అన్నంతగా ఆయన ఊగిపోవటం చూసి అందరూ షాక్ అయ్యారు. గతంలో ఎప్పుడూ చూడలేదు బాబుగారిలో ఈ ఆవేశం. కరోనా కారణంగా ఎనిమిది నెలలు ఇంట్లోనే ఉంటున్న చంద్రబాబులో ఏంటీ మార్పు అని అందరూ చర్చించుకోవటం జరిగింది.

చంద్రబాబు ఆవేశానికి కారణం ఏంటో తెలుసా.. వారం, 10 రోజులుగా ఏపీలో పడుతున్న వానలు, వస్తున్న వరదలతో రైతులు తమ పంటలను నష్టపోయారు. దీనికి పరిహారం ఇవ్వాలని, తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం అప్పటికే క్లారిటీ ఇచ్చింది. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం అని.. ప్రతి గంజను కొంటాం అని.. అదే విధంగా ఇన్ పుట్ సబ్సిడీని డిసెంబర్ చివరి నాటికి రైతు ఖాతాల్లో జమ చేస్తాం అని తెలిపింది.

దీనిపై చర్చకు డిమాండ్ చేశారు చంద్రబాబు. ఇప్పటికే ప్రకటన చేశాం.. రైతులను ఆదుకుంటాం అని స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత చర్చ ఎందుకు అని ప్రశ్నించారు వైసీపీ మంత్రులు. టీడీపీ హయాంలోని.. ఐదేళ్ల ఇన్ పుట్ సబ్సిడీ 8 వేల కోట్ల రూపాయలను ఇటీవల సీఎం జగన్ విడుదల చేసిన విషయాన్ని ప్రవస్తావించారు మంత్రులు.

దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయారు చంద్రబాబు. ప్రభుత్వం ఏం మాట్లాడుతుందో అర్థం అవుతుందా.. మీకు పరిపాలన చేయటం చేతగాదు అంటూ విరుచుకుపడ్డారు. చర్చ జరపాల్సిందే అని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వంపై ఈ విధంగా ఊగిపోయారు. చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతుంటే.. సీఎం జగన్ మాత్రం కళ్ల పెద్దవి చేసి చూస్తే భయపడతారా.. కేకలు ఎందుకు వేస్తున్నాం అంటూ తన చేతులతో కళ్లను చూపిస్తూ నవ్వారు.

సీఎం జగన్ వైఖరితోనూ మరింత అసహనంతో రెచ్చిపోయిన చంద్రబాబు.. ఆగ్రహంతో ఊగిపోతూ.. స్పీకర్ పోడియం ఎదుట నేతలపై బైఠాయించారు.

ఇదండీ చంద్రబాబు ఆగ్రహానికి.. ఆవేశానికి కారణం.. బాబుగారూ ఏంటీ ఆవేశం అంటున్నారు అభిమానులు.. అసలే వయస్సు 70 దాటింది.. ఇంత ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదు అని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు