ఫస్ట్ టైం.. FIRలో చంద్రబాబు పేరు – ఏప్రిల్ 7వ తేదీ ఏం జరగబోతుంది

ఫస్ట్ టైం.. FIRలో చంద్రబాబు పేరు - ఏప్రిల్ 7వ తేదీ ఏం జరగబోతుంది

chandra babu name in FIR in First time
chandra babu name in FIR in First time

40 ఏళ్ల ఇండస్ట్రీ.. నిప్పు అని పదేపదే చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు ఊహించని ఘటన ఎదురైంది. చాలా విచారణలపై ఆయా కోర్టుల్లో స్టేలు ఉన్న సంగతి తెలిసిందే అయినా.. ఇప్పటి వరకు ఒక్క కేసులోనూ ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో దాఖలైన సందర్భం లేదు. ఇప్పుడు మొదటిసారి అలా జరుగుతుంది. ఈసారి కచ్చితంగా జరిగి తీరుతుంది అంటున్నారు.

ఓటు నోటు కేసులో కోర్టులో జడ్జి ఎదుట స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్. నాకు స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారని.. వాళ్లు చెప్పినట్లు చేయాలని సూచించారని.. మిగతా అన్ని విషయాలు నేను చూసుకుంటానని హామీ ఇచ్చారని.. ఫోన్ లో చంద్రబాబు స్వయంగా మాట్లాడారని జడ్జి ఎదుట కుండబద్దలు కొట్టారు. అసలు ఆరోజు ఏం జరిగిందో కూడా వివరంగా వివరించారు కోర్టులో.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా.. టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని.. అందు కోసం 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారని.. అడ్వాన్స్ గా 50 లక్షలు ఇచ్చారని.. 500 రూపాయల నోట్లు ఇచ్చారని కోర్టులో స్లీఫెన్ సన్ సుదీర్ఘ వాంగ్మూలం ఇచ్చారు. చంద్రబాబు పాత్రను ఉందని.. ఆయన ఫోన్ లో మాట్లాడారని.. నా దగ్గరకు వచ్చిన రేవంత్ రెడ్డి, ఉదయసింహలు చెప్పినట్లు చేయాలని చంద్రబాబు ఫోన్ లో చెప్పినట్లు కోర్టులో తెలిపారు సెబాస్టియన్.

హ్యారీ సెబాస్టియన్ స్వయంగా వాంగ్మూలం ఇవ్వటంతో.. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామంగా మారింది. ఫోన్ లో మాట్లాడింది చంద్రబాబే అని స్వయంగా వివరించటంతో.. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు నమోదు చేయకతప్పని పరిస్థితి నెలకొంది. ఈ కేసులో తప్పించాలని.. తన ప్రమేయం లేదని చంద్రబాబు ఇప్పటికే కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పుడు బాధితుడు స్వయంగా వాంగ్మూలం ఇవ్వటంతో.. విధిలేని పరిస్థితిలో ఎఫ్ఐఆర్ చంద్రబాబు పేరు నమోదు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఒకవేళ ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు నమోదు చేయకపోతే న్యాయ వ్యవస్థపైనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. నిందితుల్లో అతను కూడా ఉన్నాడని ఆధారాలతోసహా బాధితుడు చెప్పినా.. ఆ పేరు చేర్చకపోతే ఎంత అన్యాయమో.. ఈ కేసులోనూ అలాంటి సిట్యువేషన్ వచ్చిందని లాయర్లు అంటున్నారు. ఎవర్ని అయితే ప్రలోభపెట్టారో.. అతనే స్వయంగా చంద్రబాబు పాత్ర ఉందని కోర్టులో వాంగ్మూలం ఇచ్చారంటే.. కచ్చితంగా చంద్రబాబు విచారణ ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.

కౌంటర్ దాఖలుకు ఏప్రిల్ 7వ తేదీ వరకు కోర్టు గడువు ఇచ్చింది. ఆ రోజు ఏం జరగబోతుంది.. చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్ చేర్చి విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అదే జరిగితే.. ఇక నుంచి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కోర్టు చుట్టూ తిరగాల్సిందే..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు