అసెంబ్లీలో నేలపై కూర్చున్న చంద్రబాబు

అసెంబ్లీలో నేలపై కూర్చున్న చంద్రబాబు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు సైతం షాక్ అయ్యారు. వయస్సుకు తగ్గట్టుగా నడుచుకోవాలని.. నేలపై కూర్చోవటం ఏంటని.. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

chandra babu sit on floor in AP assembly
chandra babu sit on floor in AP assembly

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రైతులకు పరిహారం ఇవ్వాలనే డిమాండ్ పై చర్చ సందర్భంగా తీవ్రంగా ఆగ్రహంతో ఊగిపోతూ.. షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. స్పీకర్ పోడియం ఎదుట.. నేలపై కూర్చున్నారు. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనతోపాటు కింద కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చంద్రబాబు నిర్ణయంతో సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు సైతం షాక్ అయ్యారు.
వయస్సుకు తగ్గట్టుగా నడుచుకోవాలని.. నేలపై కూర్చోవటం ఏంటని.. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

వరదలు, వర్షాలతో నష్టపోయిన రైతులకు 8 వేల కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ ఇప్పటికే.. రైతుల ఖాతాల్లో వేశాం అని.. ఇప్పటి నష్టాన్ని అంచనా వేసి నెల రోజుల్లో పరిహారం విడుదల చేస్తాం అని ప్రభుత్వం చెబుతున్నా.. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు.
తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఎంత ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారని ప్రశ్నించారు.

దీనిపై టీడీపీ మాట్లాకపోగా.. ప్రభుత్వం వైఖరికి నిరసన అంటూ బైఠాయించటం ఏంటని ప్రశ్నించారు మంత్రులు.

సభ నుంచి చంద్రబాబుతో సహా 13 మంది ఎమ్మెల్యేలను ఒక రోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. సభ ఆమోదించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు