చంద్రబాబుపై విసిరిన రాయి ఇదే.. చిన్నది కాబట్టి సరిపోయింది.. లేకపోతే.. వేసింది ఎవరు?

చంద్రబాబుపై విసిరిన రాయి ఇదే.. చిన్నది కాబట్టి సరిపోయింది.. లేకపోతే.. వేసింది ఎవరు?

వెయ్యి ఫోన్లకు 20 కెమెరాలకు దొరకలేదా రాయి : అంత నీట్ గా ఉందా రాయి : రాయి దాడిలో ఈ ప్రశ్నలే కీలకం

చంద్రబాబుపై విసిరిన రాయి ఇదే.. చిన్నది కాబట్టి సరిపోయింది.. లేకపోతే.. వేసింది ఎవరు?

తిరుపతి పట్టణంలోని గాంధీ రోడ్డులో.. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో.. రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబు వాహనంపై ఓ రాయి వచ్చి పడింది. ఊహించని పరిణామంతో షాక్ అయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వెంటనే చంద్రబాబు రక్షణ కవచంగా.. అతని వాహనం చుట్టూ వలయంగా నిలబడ్డారు.

వాహనంపై పడిన రాయిని చూపించారు చంద్రబాబు. చంపేయాలని కుట్ర చేస్తున్నారా.. ఇదంతా ప్రభుత్వం పనే.. కావాలనే చేస్తున్నారంటూ మండిపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తి విసిరిన రాయి వల్ల ఓ మహిళ, ఓ యువకుడు గాయపడ్డారని.. వాళ్ల ప్రాణాలకు ప్రమాదం లేదని చెప్పారు. రాయి దాడి తర్వాత చంద్రబాబుకు మరింత భద్రత పెంచారు.

చంద్రబాబు వాహనంపై విసిరిన రాయి చిన్నగా ఉండటం ప్రమాదం తప్పింది. ఇది ఎవరు చేశారు.. ఎవరైనా కావాలని చేశారా.. ఆకతాయిలు చేశారు.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వ్యక్తి చేశాడా అనేది విచారణలో తేలాల్సి ఉంది.

చంద్రబాబు వాహనంపై రాయి విసిరిన వ్యక్తిని గుర్తించి పట్టుకోవటం కోసం.. గాంధీ రోడ్డులోని అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. దుకాణాలతోపాటు ప్రచారాన్ని కవర్ చేస్తున్న మీడియా ఛానళ్ల ఫుటేజ్ ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తామని చెబుతున్నారు పోలీసులు.

రాయి దాడి చేసిన వ్యక్తిని వదిలేది లేదని.. అతన్ని పట్టుకోవటానికి ప్రత్యేక టీం రంగంలోకి దిగుతుందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

పోలీసుల వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.. నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని.. రౌడీయిజం నశించాలంటూ నినాదాలు చేశారు. పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు