ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు పని చేస్తే.. టీడీపీకి ప్లస్ అవుతుందా.. లాబీయింగ్ ఈజీనా..

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు పని చేస్తే.. టీడీపీకి ప్లస్ అవుతుందా.. లాబీయింగ్ ఈజీనా..

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు పని చేస్తే.. టీడీపీకి ప్లస్ అవుతుందా.. లాబీయింగ్ ఈజీనా..

2024 సాధారణ ఎన్నికలకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి పని చేయటానికి సిద్ధం అయితే.. టీడీపీ ప్లస్ అవుతుంది అంటున్నారు. దీనికి కారణం.. టీడీపీ వ్యూహకర్త బీహార్ రాబిన్ శర్మకు.. ప్రశాంత్ కిషోర్ తో ఉన్న పరిచయం.

తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం వ్యూహకర్తగా రాబిన్ శర్మ ఉన్నారు. ఇతను ప్రశాంత్ కిషోర్ దగ్గర పని చేసి వచ్చారు. ఈ పరిచయంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి… టీడీపీ దగ్గర అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు టీడీపీ నేతలు.

దేశంలో క్లిష్టపరిస్థితులు ఉన్నాయి. మోడీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. పాపులారిటీ ఏకంగా 60 శాతం తగ్గింది. పశ్చిమబెంగాల్ లో ఘోరంగా ఓడిపోయింది బీజేపీ. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, కాబోయే ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తానంటూ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.

అంటే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని.. అధికారంలోకి వచ్చే అవకాశాలు మొండుగా ఉన్నాయని వ్యూహకర్త భావిస్తున్నారు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లే కదా.. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి పని చేయటానికి రెడీ అయితే.. రాబిన్ శర్మ ద్వారా లాబీయింగ్ నడిపి.. కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని.. రాబిన్ శర్మ ద్వారా ప్రశాంత్ కిషోర్ కు దగ్గర కావటానికి ఈజీ అవుతుందని టీడీపీ భావిస్తోంది.

సీఎం జగన్ – ప్రశాంత్ కిషోర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. అయితే కాంగ్రెస్ పార్టీతో జగన్ కు శత్రుత్వం ఉంది. ప్రశాంత్ కిషోర్ చెప్పినా కాంగ్రెస్ పార్టీకి జగన్ దగ్గర అయ్యే ఛాన్స్ లేదు.. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని.. రాబిన్ శర్మను ఉపయోగించుకుని.. చంద్రబాబు కొత్త వ్యూహం ఎలా పన్నుతారో చూడాలి అంటున్నారు.. ఓ రకంగా జాతీయ రాజకీయాల్లో మళ్లీ టీడీపీ ప్లస్ అయినా ఆశ్చర్యం లేదు.. కాకపోతే ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ పార్టీకి పని చేయాలి.. అప్పుడే ఇదంతా జరుగుతుంది అంటున్నారు టీడీపీ నేతలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు