లాక్ డౌన్ పెట్టాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న చంద్రబాబు : నెటిజన్ల రియాక్షన్ తో షాక్

chandrbabu naidu over corona virus

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని.. రోజువారీగా 10 వేల కేసులు వస్తున్నాయని.. పరీక్షలు అన్నీ రద్దు చేసి వెంటనే లాక్ డౌన్ పెట్టాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఇంట్లో నుంచి జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఏపీలో కరోనా పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తికి ప్రభుత్వం నిర్లక్ష్యం, నిరంకుశత్వమే కారణమన్నారు. చాలాగాని ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని.. పరీక్షలు పెట్టటం వల్ల పిల్లలు బస్సుల్లో, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ కరోనా బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని చాలా రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేశాయని.. సీఎం జగన్ మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారని తన బాధను వ్యక్తం చేశారు బాబు.

చంద్రబాబు ప్రెస్ మీట్ చూసిన నెటిజన్లు.. ఆన్ లైన్ లోని షాక్ అయ్యారు. ఏపీలో కరోనా పూర్తిగా స్థాయిలో.. కరోనా కట్టడి అయిన తర్వాత.. వ్యాక్సిన్ ప్రక్రియను అడ్డుకుని మరీ ఎన్నికలు నిర్వహణకు సంపూర్ణ సహకారం, తెర వెనక ప్రయత్నాలు చేసింది టీడీపీ కాదా అంటూ నెటిజన్లు ఆన్ లైన్ లోనే కామెంట్లు చేయటం విశేషం. స్థానిక ఎన్నికలను వ్యాక్సినేషన్ తర్వాత పెట్టుకుందాం అని ప్రభుత్వం విజ్ణప్తులు చేసినా.. ఎన్నికలంటే ప్రభుత్వానికి భయం అంటూ కామెంట్ చేసింది టీడీపీ కాదా అని ప్రశ్నలు సంధించారు నెటిజన్లు.. దీంతో రెగ్యులర్ 2 నుంచి 3 గంటలుసాగే ప్రెస్ మీట్.. కేవలం గంటకే క్లోజ్ కావటం వెనక ఇదే కారణం అంటున్నారు నెటిజన్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు