ఢిల్లీ టూర్ ప్లాన్ చేసిన చంద్రబాబు.. ఓడిన తర్వాత ఫస్ట్ టైం.. గోప్యంగా టూర్ విశేషాలు

chandrbabu naidu over corona virus

2014 – 2019 వరకు ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. అక్షరాల 39 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఢిల్లీ మాటే ఎత్తటం లేదు. కరోనాతో ఏడాది కాలంగా ఇంట్లోనే ఉంటూ వచ్చారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి మాత్రం బయటకు వచ్చారు.. ఆ తర్వాత మళ్లీ జూమ్ ద్వారానే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ప్లాన్ చేశారు.. జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ అంతా ఖరారు అయ్యింది. ఈ వివరాలు బయటకు రాకుండా గోప్యంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుతోపాటు ఇంకా ఎవరెవరు ఢిల్లీ వెళ్లనున్నారు అనేది ఆసక్తిగా మారింది.

ఓడిన తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీ టూర్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఏంటీ అనేది పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఇంత సడెన్ గా ఎందుకు వెళుతున్నారు.. ఎవర్ని కలవబోతున్నారు.. ఏయే అంశాలపై ఢిల్లీలో.. ఎవరితో చర్చించనున్నారు అనేది టీడీపీలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.

విషయం చిన్నదైనా ఎంతో హడావిడి చేసే ఎల్లో మీడియా సైతం చంద్రబాబు ఢిల్లీ ప్లానింగ్ విషయంలో కనీసం లీక్ ఇవ్వటం లేదు. బ్లూ మీడియా చంద్రబాబు ఢిల్లీ టూర్ పై ఉప్పందటంతో.. ఎందుకు అనే ఆరా మొదలుపెట్టేసింది.

మే నెలలో ముగిసిన టీడీపీ మహానాడులో.. కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఉంటుందని తీర్మానం చేయటం అందరికీ తెలిసిందే. ఈ తీర్మానం తర్వాతే చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్లానింగ్ చేయటం వెనక రాజకీయ కోణం ఉందనే వార్తలు వస్తున్నాయి.

ఏపీలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులు, టీడీపీ నేతలను హత్య చేయటంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి చంద్రబాబు రిపోర్ట్ ఇవ్వనున్నారనే ప్రచారం ఉంది. అమిత్ షా అపాయింట్ మెంట్ దొరికిన తర్వాతే ఢిల్లీ టూర్ విశేషాలను లీక్ చేయాలని నిర్ణయించారంట చంద్రబాబు. అప్పటి వరకు గోప్యంగా ఉంచాలని డిసైడ్ అయ్యారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు